ఆ సీక్రెట్ ఏంటి చిన్నమ్మా..?

0
293
seshikala secrets known to dinakaran

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

seshikala secrets known to dinakaranజయలలిత చావుబతుకుల మధ్య ఉన్నప్పుడు ఆమె వీడియో రిలీజ్ చేయాలని ఎవరు ఎంత మొత్తుకున్నా శశికళ అంగీకరించలేదు. చివరకు ఐదుసార్లు సీఎంగా చేసిన కరుణానిధి మాటకూ విలువ ఇవ్వలేదు. అమ్మంటే పడి చచ్చిపోయే వీరాభిమానులు, పార్టీ కార్యకర్తలు బతిమిలాడినా కరుణించలేదు. ఎందుకని, ఏంటంత సీక్రెట్. ఈ విషయంపై స్పష్టత లేకపోయినా.. శశి మేనల్లుడు దివాకరన్ మాటలు వింటుంటే మాత్రం ఏదో ఉందనిపిస్తోంది. ఆ ఫోటోలు, వీడియోలు ఏవి బయటకొచ్చినా సూసైడ్ చేసుకుంటానని చిన్నమ్మ బెదిరించారని ఆయన అంటున్నాడు.

చిన్నమ్మకు జయలలిత అంటే ఎంత ప్రేమో ప్రపంచానికి తెలుసు. అలాంటి శశికళ.. ఫోటోలు వీడియోలు బయటికొస్తే చిన్నమ్మ ఆత్మహత్య చేసుకునేంతగా అందులో ఏముందని అందరూ ఆరా తీస్తున్నారు. దీంతో జయ మరణంపై ఉన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. అదృష్టం బాగుండి శశికళ జైలు కెళ్లిందని, లేకుంటే పార్టీని కబ్జా చేసేదని జయ వీరాభిమానులు ఆరోపిస్తున్నారు. దివాకరన్ ను అరెస్ట్ చేసి విచారణ జరిపితే నిజానిజాలు వెలుగులోకి వస్తాయంటున్నారు అమ్మ అనుచరులు.

అమ్మ మరణం వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తున్న పన్నీర్ వాదనకు దివాకరన్ తన అనాలోచిత వ్యాఖ్యలతో మరింత బలం చేకూర్చారు. చావుబతుకుల్లో ఉన్న జయను జనం చూస్తే ఆమె పరువు పోతుందనడం భ్రమే. ఎందుకంటే జయలలిత కంటే గొప్ప లీడర్ల అంతిమ సీన్లు కూడా ప్రజలు చూశారు. అంతమాత్రాన వారి గౌరవం తగ్గిపోలేదు. సింహాన్ని సింహంలాగే పంపించామంటున్న శశి మాటల వెనుక మర్మం ఉందని అన్నాడీఎంకే క్యాడర్ నమ్ముతోంది. అందుకే ఆ వీడియోలు బయటపెట్టాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. నిజంగా శశికి జయ మీద గౌరవం ఉంటే అసలు వీడియోలు తీయకూడదు. కానీ తీసి తన కుటుంబ సభ్యులకు సీడీలిచ్చి, మిగతా వారికి ఇవ్వకపోవడం.. అన్ని అనుమానాలకు కారణమైంది.

Leave a Reply