ఒకే దెబ్బ‌కు మూడు పిట్ట‌లు ఫ‌ట్!!

0
314
seshikala shock to modi,stalin and selvam

Posted [relativedate]

seshikala shock to modi,stalin and selvam
జ‌య‌ల‌లిత‌ వెన‌కుండి.. ఆ రాజ‌కీయం బాగా అబ్బిన‌ట్టుంది..!!! అందుకే రాజ‌కీయాలు చేయ‌డంలో అమ్మ‌కు ఏమాత్రం తీసిపోన‌ని చాటుకుంది శ‌శిక‌ళ‌!! చివ‌ర‌కు జైలు శిక్ష ప‌డ్డా మొండి ప‌ట్టుద‌లతో ముందుకెళ్లింది. తాత్కాలికంగా కింద ప‌డ్డా… త‌న చేయి మాత్రం పైనే ఉంటుంద‌ని నిరూపించుకుంది. ఒకే ఒక దెబ్బ‌తో మోడీ స‌ర్కార్ తో పాటు ప‌న్నీర్ సెల్వం, స్టాలిన్ వ‌ర్గాల ఎత్తుల‌ను చిత్తు చేసింది.

ప‌న్నీర్ సెల్వం రెబ‌ల్ గా మారిన త‌రుణం నుంచి శ‌శిక‌ళ‌కు ప‌రిస్థితుల‌న్నీ ప్ర‌తికూలంగా మారాయి. కేంద్ర‌ప్ర‌భుత్వం నుంచి స‌వాళ్లు ఎదుర‌య్యాయి. అన్నాడీఎంకే అంత‌ర్గత వ్య‌వ‌హార‌మంటూనే చేయాల్సింది చేశారు ఢిల్లీ పెద్ద‌లు. ఇక చిన్న‌మ్మపై తిరుగుబాటుతో ప‌న్నీర్ సెల్వం అన్ని వ‌ర్గాల సానుభూతిని పొందారు. ఆ సానుభూతి రోజురోజుకు మ‌రింత పెరిగింది. ఇటు స్టాలిన్ కూడా చిన్న‌మ్మ సీఎం కాకుండా ఉండేందుకు .. సెల్వంకు మ‌ద్దతిస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఇలా ఒకే స‌మ‌యంలో కేంద్రం, సెల్వం, స్టాలిన్ ఈ ముగ్గురూ… ప్ర‌యోగించిన అస్త్రాల‌ను ఎదుర్కొనేందుకు శ‌శిక‌ళ సిద్ధ‌మైంది. ప‌రిస్థితుల‌న్నీ ప్ర‌తికూలంగా మారినా మొండిగా వ్య‌వ‌హ‌రించింది.

నిజానికి శ‌శిక‌ళ స్థానంలో మ‌రొక మ‌హిళ ఉంటే… కాడి వ‌దిలేసి ఓట‌మిని అంగీక‌రించేదేమో…కానీ చిన్న‌మ్మ మాత్రం అంత ఈజీగా త‌లొంచ‌లేదు. జైలుశిక్ష ప‌డ‌బోతుంద‌ని తెలిసి కూడా త‌న వ్యూహ‌ర‌చ‌న‌లో నిమగ్న‌మైంది. చాప‌కింద నీరులా త‌న ప్లాన్ ను అమ‌లు చేసింది. చివ‌ర‌కు తాను అనుకున్న విధంగానే ప‌ళ‌నిస్వామిని ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టి… ఒకేసారి ముగ్గురు బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థుల‌కు గ‌ట్టి షాకిచ్చింది. అందుకే శ‌శిక‌ళ వ‌ర్గీయులు … చిన్న‌మ్మ ఒకే దెబ్బ‌కు మూడు పిట్ట‌లు కొట్టింద‌ని తెగ సంబుర ప‌డిపోతున్నారు!!!

Leave a Reply