చిన్న‌మ్మ‌కు నిద్ర‌లేని రాత్రులు!!!

Posted March 22, 2017

seshikala sleepless nights
నిన్న‌మొన్న‌టిదాకా రాజ‌భోగాలు అనుభ‌వించి… ఇప్పుడు బెంగుళూరులో జైలు జీవితం గ‌డ‌పాల్సి రావ‌డం శశిక‌ళ‌కు మింగుడుప‌డ‌డం లేదు. ఎలాగైనా అక్క‌డ్నుంచి బ‌య‌ట‌ప‌డడానికి కొత్త ఎత్తులేస్తున్నా… ఇప్ప‌ట్లో అది సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. క‌నీసం అక్క‌డ్నుంచి చెన్నై సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా… అదీ కుదర‌డం లేదు.

లాయ‌ర్లు చేతులెత్తేయ‌డంతో చిన్న‌మ్మ‌కు క‌న్నీరు ఆగ‌డం లేద‌ట‌. రాత్రిళ్లు బోరుమంటూ ఏడుస్తోంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతేకాదు జైల్లో పెట్టి ఆహారం ప‌డ‌ట్లేద‌ట‌. ఎండ‌ ఎక్కువ‌గా ఉండ‌డంతో జైల్లో ఎక్కువ వేడి ఉంది. ఏసీ గ‌దుల్లో ఉన్న ఆమె ఇప్పుడు ఆ వేడిని భ‌రించ‌లేక‌పోతుంద‌ట‌. దీంతో ఆమెకు ప్ర‌శాంత‌తే క‌రువైంద‌ట‌. అస‌లు ఆమెకు నిద్ర‌లేని రాత్రులే మిగిలాయ‌ని చెబుతున్నారు.

ఇటీవ‌ల మ‌న్నార్గుడికి చెందిన కొంత‌మంది శ‌శిక‌ళ‌ను చూడ‌డానికి వెళ్లార‌ట‌. వాళ్ల‌ను చూడ‌గానే చిన్న‌మ్మ బోరుమ‌ని ఏడ్చేసింద‌ని స‌మాచారం. ఎప్పుడూ గుంభ‌వంగా ఉండే ఆమె ఒక్క‌సారి ఏడ్చేసరికి వారికి కూడా క‌న్నీరు ఆగ‌లేద‌ట‌. అయితే ఏం ప‌ర్లేదు.. త్వ‌ర‌లోనే చెన్నై సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని వారు చెప్పినా… అది సాధ్యం కాద‌ని చిన్న‌మ్మే అంగీక‌రించింద‌ట‌. ఈ జైలు క‌ష్టాలు త‌నకు రాసి పెట్టి ఉన్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింద‌ని టాక్. దీనికి ఎవ‌రేం చేయ‌గ‌ల‌రు? జైలుశిక్ష ప‌డిన‌ప్పుడు అనుభ‌వించ‌క త‌ప్ప‌దు!!!

SHARE