రాణీ రాణెమ్మ ఆనాటి నవ్వులు ఏవమ్మా?

Posted February 6, 2017

seshikala smiling in past but not in presentఈ ఫోటో చూస్తే రాజకీయం ఎన్ని మలుపులైనా తిరుగుతుందని …అందులో ఊహకైనా అందని మలుపులు వుంటాయని చెప్పేయొచ్చు.ఇంటిపనికోసమొచ్చి సీఎం పీఠం దాకా ఎక్కిన శశికళ ఎంత తెలివైందో అని కొందరు …స్థాయికి మించిన ఛాన్స్ కొట్టేసిందని ఆమె అదృష్టాన్ని చూసి ఇంకొందరు అసూయపడుతున్నారు.ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే . చేతిలో ఓ చిన్న పెట్టె తో జయ నివాసం పోయెస్ గార్డెన్ లోకి అడుగు పెడుతున్నప్పుడు శశికళ ఎంతగా నవ్వుతూ ఉందో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేస్తున్న ఈ చిత్రంలో క్లియర్ గా కనిపిస్తోంది.ఓ సెలబ్రిటీ పక్కన నడవడంలో ఉన్న మజాని ఎంజాయ్ చేస్తున్న అమాయకత్వం శశి మోహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.ఊహించని విధంగా సినిమాల్లో,రాజకీయాల్లో స్టార్ అయిన వ్యక్తికి దగ్గరగా మెసిలే అవకాశం రావడాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తోంది శశికళ.

రాజకీయాల్లోకి వచ్చాక శశికళకి దక్కుతున్న సీఎం పీఠం మాత్రమే అందరికీ కనిపిస్తోంది.ఆమె ఆ స్థాయికి రావడానికి ఎన్ని అవమానాలు భరించి ఉంటుందో ? చివరికి నెచ్చెలి అనుకున్న జయ కూడా ఆమెని కొన్ని సందర్భాల్లో ఇంటినుంచి గెంటేశారు.ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం కళ్ల ముందు కనిపిస్తున్నా శశికళ మోహంలో చూద్దామన్నా నవ్వు కనిపించడం లేదు.ఇక ఆమె వ్యక్తిత్వం, రాజకీయాల గురించి ఎన్ని విమర్శలు వస్తున్నాయో చూస్తూనే వున్నాం.వీటన్నిటీ మధ్య ఆమె మోహంలో మాయమైపోయిన నవ్వు విలువే ఈ సీఎం పీఠం అనుకోవచ్చు.

SHARE