ఏపీలో మన్నార్ గుడి మాఫియా పూజలు..

Posted March 19, 2017

seshikala team puja in ap
జయ సమాధి సాక్షిగా రెచ్చిపోయి శపధం చేసిన శశికళ రాజకీయ ప్రత్యర్థుల ఎత్తులైతే చిత్తు చేసింది .కానీ ఆ ఎత్తులతో సీఎం అయిన పళనిస్వామి చేతుల్లో తాను కూడా చిత్తు కావాల్సివస్తుందని ఊహించలేదు.తలచినదే జరిగితే అది ఎందుకు రాజకీయం అవుతుంది?అందునా రాజకీయం అసలెందుకు అవుతుంది? శశికళ అండతో దర్జాగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న పళనిస్వామి తనకు ఇంతటి యోగం పట్టించిన శశికళని మర్యాదకి కలుసుకోలేదు సరికదా ఆమె పేరు ఎత్తిన వాళ్ళని ఏ మాత్రం లెక్కచేయడం లేదట.పైగా చిర్రుబుర్రులాడుతూ ఆ పేరు తన దగ్గరా తీసుకురావొద్దని నేరుగా చెప్పేస్తున్నాడట.ఈ పరిణామం అధికారం ఉంటే ఏదో ఒక పని చేసుకుని మరింత వెనకేసుకుందామని భావించిన మన్నార్ గుడి మాఫియాకి ఊహించని ఎదురు దెబ్బ.దీంతో ఏమి చేయాలో పాలుపోక జైల్లో వున్న చిన్నమ్మకి మొరపెట్టుకున్నారట.అప్పటికే పళనిస్వామి మీద కంప్లైంట్స్ వినీవినీ రగిలిపోతున్న శశికళ రాజకీయంగా ప్రస్తుతానికి పళనిస్వామిని ఏమీ చేయలేమని వారికి చెప్పిందట.అయితే సమస్య పరిష్కారం కోసం ఎవరైనా జోస్యుడిని సంప్రదించి ఆయన చెప్పిన పూజలు చేయాలని సూచించిందట.

శశికళ చెప్పినట్టు మన్నార్ గుడి మాఫియా ఓ ప్రముఖ జ్యోతిష్కుడిని కలిసి సలహా కోరింది.ఆంధ్రప్రదేశ్,తూర్పు గోదావరి జిల్లా,మందపల్లి లో వున్న శ్రీ మందేశ్వర(శనీశ్వరుడు) స్వామికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు చేయాలని ఆ జ్యోతిష్కుడు సూచన చేయడంతో..ప్రముఖ సిద్ధాంతి కేవీ రెడ్డి ద్వారా మన్నార్ గుడి మాఫియా లో ఒకడిగా చెప్పుకునే శశికళ మేనల్లుడు టీవీ మహదేవన్ రంగంలోకి దిగారు.ఆయన కోయంబత్తూర్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో దిగిపోయారు.మందపల్లిలో జోస్యుడు చెప్పిన పూజలు,అభిషేకాలు చేశారు.ఆ టైం లో ఆలయంలో హడావిడి చూసిన ఓ భక్తుడు చిరాకుతో …పాపాలు చేసి పూజలు చేస్తే సరిపోతుందా ? సుప్రీమ్ కోర్ట్ తీర్పు మారి శశికళ బయటికొస్తుందా ? అనడం కనిపించింది..సారీ ..వినిపించింది.

SHARE