ఎమ్మెల్యేల్లో “మన్నార్గుడి” భ‌యం!!

0
251
seshikala warning to mlas

 Posted [relativedate]

seshikala warning to mlas
శ‌శిక‌ళ జైలుకు వెళ్లిపోవ‌డంతో ఇప్పుడు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చాలామంది పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. ఆమె క్యాంపులో ఉన్న ఎమ్మెల్యేలంతా ఇప్పుడు సెల్వం వైపు చూస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే చిన్న‌మ్మ లేక‌పోయినా… ఆమె వ‌ర్గంగా చెప్పుకునే మన్నార్గుడి బ్యాచ్ తోనే ఆ ఎమ్మెల్యేలు భ‌య‌ప‌డుతున్నార‌ట‌. అందుకే సెల్వం ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేందుకు వెన‌కా ముందు బాగా ఆలోచిస్తున్నార‌ని టాక్.

మన్నార్గుడి మాఫియా గోల్డెన్ బే రిసార్డులో ఎమ్మెల్యేల‌కు ఒక విష‌యంలో క్లియ‌ర్ గా చెప్పింద‌ట‌. శ‌శిక‌ళ జైలుకు వెళ్తే… ఆమె వ‌ర్గానికి చెందిన వ్య‌క్తే సీఎం కావాలి. ఏమాత్రం అటు ఇటు అయినా … దేనికైనా తెగిస్తామ‌ని గ‌ట్టిగా వార్నింగ్ ఇచ్చార‌ట‌. సెల్వం సారు సీఎం అయితే మాత్రం ఎవ‌రినీ వ‌దిలిపెట్టేది లేద‌ని బెదిరించార‌ట‌. చాలామంది ఎమ్మెల్యేల కీల‌క స‌మాచారం ఇప్ప‌టికే మ‌న్నార్గుడి మాఫియా చేతుల్లో ఉంద‌ట‌. ఎమ్మెల్యేల వ్యాపారాలు, ఇత‌ర‌త్రా విష‌యాల‌పై ఆధారాలున్నాయ‌ట‌. దాంతో ఎమ్మెల్యేల‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌ని టాక్. అందుకే క్యాంపులోని ఎమ్మెల్యేలు ఇంకా బ‌య‌ట‌ప‌డ‌డం లేద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అటు మాజీ మంత్రుల ప‌రిస్థితి కూడా అంతేన‌ట‌.

సెల్వం సీఎం అయినా… ప‌ళ‌నిస్వామి సీఎం అయినా… ముందు తాము సేఫ్ గా ఉండాల‌ని ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారు. అందుకే చిన్న‌మ్మ జైలుకెళ్లినా… ఇంకా ఆ ఎమ్మెల్యేలు డైల‌మాలోనే ఉన్నారు. సెల్వం వ‌ర్గం నుంచి బంప‌ర్ ఆఫ‌ర్లు వ‌స్తున్నా స్పందించ‌డం లేదు. ఎంతైనా మ‌న్నార్గుడి రాజ‌కీయాన్ని ఒప్పుకొని తీరాల్సిందే!!

Leave a Reply