ఏపీకి కలిసింది7 మండలాలేకాదు వేలకోట్లు..

Posted November 8, 2016

seven mandals into andhra with with thousand crores
పోలవరం ముంపు మండలాల్ని ఏపీ లో కలుపుతూ మోడీ సర్కార్ తొలి క్యాబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..అయితే అలా ఏపీ లో కలిసింది 7 మండలాలు మాత్రమే కాదు వేలాది కోట్ల విలువైన ఖనిజ సంపద కూడా.ఏపీ లో కలిసిన కుకునూరు మండలంలో 2.35 లక్షల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల దాకా ఐరన్ ఒర్ నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. విషయం తెలియగానే ఆ గనుల్ని విశాఖ ఉక్కుకి కేటాయించాలని సీఎం చంద్రబాబు చేసిన విన్నపాన్ని కేంద్రం అంగీకరించింది.

కుకునూరు మండలం ఏపీ లో విలీనం అయ్యాక పశ్చిమ గోదావరి జిల్లా అటవీ ప్రాంత పరిధిలోకి వచ్చింది.అంటే ఇక్కడ మైనింగ్ జరపాలంటే…ట్రైబల్ మినరల్ కార్పొరేషన్ ద్వారా మాత్రమే సాధ్యం.ఈ గనులు తెలంగాణాలో ఉండివుంటే ప్రతిపాదన దశలో ఉన్న బయ్యారం ఉక్కు కర్మాగారానికి ఐరన్ ఒర్ అవసరాన్ని చాలా వరకు తీర్చగలిగేవి.ఇప్పుడు అలాంటి అవకాశం లేనట్టే.ఎందుకంటే గతంలో విశాఖ ఉక్కుకు బయ్యారం గనుల ప్రస్తావన వచ్చినప్పుడు తెలంగాణ వాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

SHARE