కేజ్రీవాల్ ఇలాకాలో సెక్స్ చచ్చిపోతోంది!!

0
229
sex problems for pollution in delhi

Posted [relativedate]

sex problems for pollution in delhi
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మగాళ్లలో సెక్స్ చచ్చిపోవడానికి లింకేంటి? అని ఆశ్చర్యపోకండి. కచ్చితంగా లింకు ఉంది. అది ఏంటంటే కేజ్రీవాల్ ఇలాకా అయిన ఢిల్లీని కాలుష్యం షేక్ చేస్తోంది. దేశ రాజధాని హస్తిన పొల్యూషన్ కోరల్లో చిక్కుకొని విలవిలలాడిపోతుంది. అటు కేంద్రం, ఇటు కేజ్రీవాల్ సర్కార్ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం మాత్రం శూన్యం. అంతేకాదు పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారిపోవడం మరింత శోచనీయం. ఇటీవల ఏకంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది.

ఢిల్లీలో పొల్యూషన్ పై మెడికేర్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మగవారిని దిగ్భ్రాంతికి గురిచేసే నిజం ఒకటి తెలిసింది. హస్తినలో పొల్యూషన్ దెబ్బకు మగవారి జుట్టు రాలిపోతోందట. అంతేకాదు లైంగిక సామర్థ్యం కూడా హుష్ కాకి అయిపోతోందట. మగాళ్లలో కోరికలు చచ్చిపోతున్నాయని సర్వే స్పష్టం చేసింది. ఈ ఏడాదికాలంలో అయితే పరిస్థితి మరింత దారుణాతి దారుణంగా తయారైందని సర్వేలో వెల్లడైంది.

సర్వే ప్రకారం ఈ యేడాది జనవరిలో మగాళ్లలో స్పెర్మ్ కౌంట్ తగ్గింపు 14 శాతం ఉంటే.. నవంబర్ నాటికి అది 27 శాతానికి పెరిగిపోయింది. 30-40 ఏళ్ళ మధ్య వయసున్న మగాళ్ళలో ఇది మిల్లీ లీటర్‌కు 10 మిలియన్ల కన్నా తక్కువేనట. నేషనల్ ఏవరేజ్ ప్రకారం ఇది 20 మిలియన్లు ఉండాలట. అంటే సెక్స్ ఎనర్జీ సగానికి సగం తగ్గిపోయిందన్న మాట.

పొల్యూషన్ దెబ్బకు మహిళలకూ ఇబ్బందులు తప్పడం లేదట. వారిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతోందని తేలిందట. అంతేకాకుండా లేడీస్ వివిధ శారీరక రుగ్మతలకు గురవుతున్నారట. పరిస్థితి ఇలాగే ఉంటే … ఢిల్లీ అంటే జనం వామ్మో అంటారేమో..రాజకీయ నాయకులు తప్ప ఆమ్ ఆద్మీలు ఎవరూ అక్కడ కనిపించరేమో!!.

Leave a Reply