మంత్రి గారి రాసలీలలు ..

0
298
Sex tape issue haunts excise minister hy meti

Posted [relativedate]

Sex tape issue haunts excise minister hy metiకర్నాటక రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి హెచ్.వై.మేఠి రాసలీలల భాగోతం ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశ మైన సంగతి తెలిసిందే..మంత్రి మేఠి, ఓ మహిళతో రాసలీలల్లో పాల్గొన్న సీడీ ఉందని కాసేపట్లోనే ప్రసారం చేస్తామనే కథనాలు వచ్చాయి. బళ్ళారికి చెందిన ఆర్‌టిఐ కార్యకర్తగా చెప్పుకుంటున్న రాజశేఖర్‌కు మంత్రి అనుచరులనుంచి బెదరింపులు వెల్లువెత్తాయి. ఆ బెదరింపుల ఆడియోను కూడా పలు చానెళ్ళు ప్రసారం చేశాయి. ఆ సీడీలు ఉన్నాయని చానెళ్ళు ప్రకటించినా వాటిని ప్రసారం చేయలేదు.

బదిలీ కోసం వచ్చిన ఓ మహిళాఉద్యోగి పట్ల మంత్రి అనుచితంగా ప్రవర్తించారని ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆర్‌టిఐ కార్యకర్త రాజశేఖర్‌ ఆరోపిస్తున్నారు. ఈమేరకు వీడియో తన వద్ద ఉందని అంటున్నాడు.

రాసలీలలకు పాల్పడినట్లు వీడియోలు ఉంటే విడుదల చేయాలని మంత్రి మేఠి ఆదివారం బాగల్కోటెలో ప్రకటించారు. రాసలీల ఆరోపణలకు తనకు సంబంధం లేదన్నారు. వీడియోలు ఉంటే విడుదల చేస్తే స్పందిస్తానన్నారు. ఆరోపిస్తున్న వ్యక్తి ఎవరో తెలియదని అంతకంటే ఆ మహిళ ఎవరో కూడా ఇప్పటివరకు చూడలేదంటున్నారు .గత కొంత కాలం గా కర్ణాటక మంత్రులు వార్తల్లోకి ఎక్కటం పరి పాటిగా మారింది .

Leave a Reply