వావ్.. కలిసినటించనున్న  షారూఖ్, అమీర్

0
141
shahrukh khan and aamir khan both are will act in advertisement

Posted [relativedate]

shahrukh khan and aamir khan both are will act in advertisementఅవును.. మీరు విన్నది నిజమే.. షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ కలిసి ఓ యాడ్ లో నటించనున్నారట. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం పెహలా నషా చిత్రంలో ఈ ఇద్దరు ఖాన్ లు కలిసి నటించారు. ఆ తర్వాత షారూఖ్, సల్మాన్… అలానే సల్మాన్, అమీర్ లు కలిసి నటించారే తప్ప షారూఖ్, అమీర్ లు ఎప్పుడూ కలిసి నటించలేదు.  ఇన్ని సంవత్సరాల తర్వాత తాజాగా ఇప్పుడు ఓ యాడ్ లో కలిసి నటించి తమ అభిమానులను అలరించనున్నారు ఈ ఇద్దరు ఖాన్ లు.

ఓ ఛానెల్ లో వ్యాపార ప్రకటన కోసం వీరిద్దరూ కలిసి నటించనున్నారని తెలిసినట్టు ‘డీఎన్ఏ’ వార్తాసంస్థ ప్రకటించింది. ఈ ప్రకటనలో అమీర్ మిఠాయి దుకాణాన్ని నడుపుతున్న సిక్కు వ్యక్తిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. అలానే షారూఖ్ ఆ మిఠాయిలను  కొనుగోలు చేసే వ్యక్తిగా దర్శనమివ్వనున్నాడట. ఈ యాడ్ ని త్వరలో షూట్ చేసి అభిమానుల ముందుకు తీసుకువస్తామని దర్శకుడు చెబుతున్నాడు.  అభిమానులు ఈ యాడ్ ని  ఛానెల్ లోనూ, అలానే ధియేటర్ లలో కూడా  చూసి ఆనందించవచ్చని అంటున్నాడు. 

Leave a Reply