పాక్ హీరోయిన్ తో కింగ్ ఖాన్ కు క‌ష్టాలు…

0
265
shahrukh khan raees movie acting in pakistani actress mahira khan

Posted [relativedate]

shahrukh khan raees movie acting in pakistani actress mahira khanబాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్ ర‌యీస్ తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా వ‌చ్చే నెల‌లో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమానే ఇప్పుడు కింగ్ ఖాన్‌కు క‌ష్టాలు తెచ్చిపెట్టింది. పాక్ న‌టి మ‌హిరా ఖాన్ ఈ సినిమాలో న‌టించ‌డ‌మే అందుకు కార‌ణం. యూరి ఉగ్ర‌దాడి త‌ర్వాత పాకిస్థాన్ న‌టులు న‌టించిన సినిమాల విష‌యంలో మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ సేన గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఎట్టి ప‌రిస్థితుల్లో పాక్ న‌టులు న‌టించిన సినిమాల‌ను రిలీజ్ కానివ్వ‌బోమ‌ని ప్ర‌క‌టించింది. ర‌యీస్ లోనే పాక్ హీరోయిన్ ఉండ‌డంతో షారుక్ కు జ‌ర‌గ‌బోయేది ఏంటో అప్పుడు అర్థ‌మైపోయింది.

ర‌యీస్ సినిమాకు ఎలాంటి అడ్డంకులు ఉండ‌కూడ‌దంటే ఏం చేయాలో షారుక్ కు క‌ర‌ణ్ జోహార్ మంచి స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. అందులో భాగంగా షారుక్ ఎకాఎకిన ఎంఎన్ఎస్ అధినేత రాజ్ థాక‌రేను క‌లిశారు. భేటీలో సినిమాకు సంబంధించిన అన్ని విష‌యాలను వివ‌రించాడ‌ట కింగ్ ఖాన్. మ‌హిరా ఖాన్ సినిమాలోఉన్నా.. ప్ర‌మోష‌న్ లో ఆమె క‌నిపించ‌ద‌ని చెప్పుకొచ్చాట‌. ద‌య‌చేసి ఈ సినిమాను అడ్డుకోవ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేసిన‌ట్టు స‌మాచారం. దానికి రాజ్ థాక‌రే కూడా సానుకూలంగా స్పందించార‌ని టాక్. కానీ అధికారికంగా మాత్రం థాక‌రే నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు.

అప్ప‌ట్లో ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విష‌యంలోనూ క‌ర‌ణ్ జోహ‌ర్ .. రాజ్ థాక‌రేను క‌లిసిన త‌ర్వాతే ప‌రిస్థితి స‌ద్దుమ‌ణిగింది. ఇప్పుడు ర‌యీస్ విష‌యంలో షారుక్ కూడా రాజ్ థాక‌రే ను క‌లిశారు. అయితే క‌ర‌ణ్ జోహ‌ర్ లాగే షారుక్ ను కూడా రాజ్ థాక‌రే క‌రుణిస్తారా.. లేదా చూడాలి.

Leave a Reply