Posted [relativedate]
తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రోబో 2.0లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్నఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి గత రెండు రోజులుగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
ఈ మూవీలో రజనీకాంత్ ఐదు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సైంటిస్ట్, రోబో, విలన్ తో పాటు మరో రెండు పాత్రలు పోషిస్తున్నారని, ఇక అక్షయ్‌కుమార్ అయితే ఏకంగా 12 పాత్రల్లో కనిపిస్తాడని ఓ న్యూస్ వైరల్ అయ్యింది. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు శంకర్ స్పందించాడు. తమ సినిమా గురించి వస్తున్న వార్తల్నీ అవాస్తవాలని, అవన్నీ కేవలం కల్పితాలని కొట్టిపారేశాడు. తమ సినిమాలో అటువంటివి ఏమీ ఉండవని క్లారిటీ ఇచ్చాడు. దీంతో అభిమానుల్లో ఏర్పడ్డ సందేహాలకు చెక్ పెట్టినట్లు అయ్యింది. సినిమా రిలీజ్ అయ్యేలోపు ఇంకెన్ని రూమర్లు వస్తాయో చూడాలి.