ఆడవాళ్ల కన్నా ఓటు విలువే ఎక్కువట!!

0
584
sharad yadav insulting women

Posted [relativedate]

sharad yadav insulting women
ఒక్కోసారి రాజకీయ నాయకులు విషయాన్ని జనాన్ని బాగా వివరించి ఆకట్టుకునే ప్రయత్నంలో బొక్కబొర్లా పడుతారు. తప్పుడు ఉదాహరణలు, పొంతన లేని వర్ణనలతో ఇరకాటంలో పడతారు. జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ కామెంట్సే అందుకు నిదర్శనం.

ఓటు గొప్పతనాన్ని చెప్పే క్రమంలో శరద్ యాదవ్ నోరుజారారు. ఆడపిల్లలను అవమానించే విధంగా కామెంట్లు చేశారు. పాట్నా లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన…ఆడపిల్లల గౌరవం కన్నా ఓటుకు ఉన్న గౌరవమే ఎక్కువని చెప్పారు. ఆడపిల్ల గౌరవం పోతే ఆ గ్రామానికి అవమానమని… అదే ఓటు గౌరవం పోతే దేశానికే నష్టమన్నారు.

ఓటును గొప్పగా చెప్పడం వరకు ఓకే గానీ మరీ ఆడవాళ్లకు.. దీనికి ఏం సంబంధమో శరద్ యాదవ్ కే తెలియాలి. ఇది బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టడం కాకపోతే ఇంకేంటి? అందుకే శరద్ యాదవ్ కామెంట్స్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సీనియర్ పార్లమెంటేరియన్ అయిన ఆయన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.

ఈ రాజకీయ నాయకులు ఒక్కోసారి మరీ ఓవర్ చేస్తుంటారు. ఒకటి చేయబోయి… ఇంకోటి చేస్తుంటారు. ఎరక్కపోయి ఇరుక్కోవడమంటే ఇదేనేమో?

Leave a Reply