వైసీపీ అధినేత ఎప్పుడు ఏ కష్టం లో ఉన్న ప్రజాక్షేత్రంలోకి వచ్చి పార్టీ కి జన సత్యాలు నింపారు ఆయన చెల్లెలు షర్మిల.. ఏ మహిళా చేయనంత సుదీర్ఘ పాదయాత్ర చేశారు. జగన్ జైలు లో ఉనంత కాలం పార్టీ శ్రేణులు చెల్లా చెదురు కాకుండా ఏకీకృతంగా నిలబెట్టిన శక్తి షర్మిల… అలాంటి ఆమెకు తెలంగాణ పగ్గాలు అప్పచెప్పుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. అది కూడా ఉత్తదేనని తేలిపోయింది. ఇంతకీ ఆమె మౌనం వెనుక ఏముంది..? జగన్ కావాలనే దూరం పెట్టారా.? షర్మిల స్వయంగా వెనక్కి తగ్గారా.? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ప్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సిందే…
జగన్ జైల్లో ఉన్న రోజులవి … షర్మిల పాదయాత్ర సాగిస్తున్న సమయం.. వైసీపీ నేతలు కొందరు ఎన్నికలు అయ్యేదాకా జగన్ బయటకి రారని భావించారు, షర్మిల నాయకత్వంలో నడవాల్సివస్తుందని భావించి ఆమెకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఆ టైమ్ లో ఆడపడుచుని పలకరించడానికి వచ్చిన జగన్ భార్య భారతిని పట్టించుకోలేదట.. దీన్ని అవమానం గా భావించిన ఆమె జగన్ వచ్చాక గతం వివరించారట. జగన్ పట్టించుకున్నాడో లేదో గాని వదిన, మరదళ్ల మధ్య ఎంతో కొంత దూరం పెరిగిందట. దాని ప్రభావమే జగన్ బాణమైన షర్మిల మౌనానికి కారంముగా తెలుస్తోంది.. ఈ వ్యవహారంతో పైకి కనిపించక పోయినా విజయమ్మ కూతురు వైపు, జగన్ భార్య వైపు మొగ్గారని ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నవాళ్లు చెపుతున్న మాట…