షారూఖ్… నువ్వు ఆ సినిమాలో నటించావా..?

0
525
sharukh guest role in bahubali

Posted [relativedate]

sharukh guest role in bahubaliఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం, దీంతో ఆ సినిమాకు భారీ హైప్ క్రియేట్ అవ్వడం ఇటీవల సాధారణమైపోయింది. అయితే తెలుగు సినిమాల్లో కేవలం తెలుగు హీరోలేకాక బాలీవుడ్ హీరోలు కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇస్తున్నారు. ఆ సినిమాలకు మరింత క్రేజ్ తీసుకొస్తున్నారు. మనం చిత్రంలో అమితాబ్ స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చి ఆ సినిమాకు క్రేజ్ పెంచాడు. గతంలో నాగార్జున నటించిన చంద్రలేఖ సినిమాలో కూడా బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ గెస్ట్ రోల్ చేశాడు. వేర్ ఈజ్ మై వైఫ్.. వేర్ ఈజ్ మై వైఫ్ అంటూ రాజకపూర్ పాత్రలో మెరిసాడు, కామెడీ పండించాడు.  కాగా ఇప్పుడు రాజమౌళి కూడా  ఈ రూట్లోనే వెళ్తున్నట్లు సమాచారం.

బాహుబలి-2 లో బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. చిత్రంలోని ప్రముఖ పాత్రను షారూఖ్‌ తో చేయించాలని రాజమౌళి నిర్ణయించారని,  షారూఖ్‌ తో చర్చలు కూడా జరిపినట్టు సమాచారం. నిజంగా షారూఖ్ బాహుబలిలో నటించాడో  లేదో మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే తేలిపోతుంది.

Leave a Reply