సిల్వర్ స్క్రీన్ పై సానియా

0
495

sharukh saniya
ఆరేళ్ళ వయసులో రాకెట్‌ పట్టిన సానియా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని ఉన్నత స్థాయికి చేరుకున్న టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా స్టోరీతో సినిమా తీస్తానని బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ అన్నారు . ఆమె సాధించిన ఘనతలు వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ అన్నాడు. తాను బాలీవుడ్‌ బాద్‌షా అయితే.. సానియా రాకెట్‌ రాణి అంటూ ప్రశంసించాడు. సానియా ఆత్మకథ ‘ఏస్‌ ఎగైన్స్ట్‌ ఆడ్స్‌’ను ఆమెతో కలిసి షారుక్‌ ఆవిష్కరించారు.

‘‘పీటీ ఉష, మేరీ కోమ్‌, సానియా లాంటి క్రీడాకారిణులు తమ ప్రదర్శనలతో దేశంలో ఎంతోమంది అమ్మాయిలు క్రీడల పట్ల ఆసక్తి చూపేలా చేశారు. సానియా ఎన్నో అడ్డంకుల్ని అధిగమించింది. క్రీడలపై వచ్చే సినిమాలు అందరిలోనూ స్ఫూర్తి రగిలిస్తాయి. నేను గతంలో చక్‌దే ఇండియా సినిమా తీశా. కుదిరితే సానియాపైనా సినిమా తీస్తానని చెప్పారు. సానియా ఆత్మకథలో పెళ్లితో పాటు అనేక అంశాల్ని ప్రస్తావించానని సానియా తెలిపింది. ‘‘29 ఏళ్ళకే పుస్తకం రాస్తానని అనుకోలేదని.. మూడోసారి ఒలింపిక్స్‌లో బరిలో దిగబోతున్నానని… కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలు నాపై ఉన్నాయి. వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నూటికి నూరుశాతం ప్రయత్నిస్తా నని సానియా చెప్పింది.

Leave a Reply