మరిచిపోయి సారి చెప్పిన షారుఖ్ ..

0
446

dle-seబాలీవుడ్ బాద్ షా – కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోయిన్ ప్రీతీ జింతాకు సారీ చెప్పారు. షారుఖ్ ఏమిటి – ఈ మధ్యకాలంలో ఆమెతో సినీమాలు కూడా పెద్దగా ఏమీ చేయడంలేదు కదా.. ఉన్నట్లుండి ఈ క్షమాపణలు ఏమిటి అనుకుంటున్నారా? అలా అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. కొన్నేళ్ల క్రితం షారూఖ్, మనీషా కొయిరాలా, ప్రీతి జింతా కలిసి నటించిన మూవీ “దిల్ సే”. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంది.

అయితే.. కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. ఈ సినిమా విడుదలై 18ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా షారూఖ్ ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఆ చిత్రాన్ని ఇప్పటికీ ప్రేమిస్తున్నానంటూ చిత్రబృందాన్ని గుర్తుచేసుకున్నారు. కానీ అందులో ప్రీతి ప్రస్తావన లేదు. దీంతో.. మరో వీడియో రూపొందించి.. ప్రీతిని కూడా కలిపారు. తొలి వీడియోలో ఈ ‘సోల్జర్’ స్టార్‌ను మెన్షన్ చేయడం మర్చిపోయినందుకు ఆమెకు సారీ చెప్పారు. అదీ సంగతి.    

Leave a Reply