కాంగ్రెస్ ను న‌లిపేస్తున్న బీజేపీ-శివ‌సేన!!!

0
495
shiv sena bjp parties shocked to congress party

Posted [relativedate]

shiv sena bjp parties shocked to congress party
మ‌హారాష్ట్ర‌లో రెండు పార్టీలు చాలాకాలంగా క‌లిసి పోటీ చేస్తున్నాయి. ఈ ఫార్ములా బాగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. రెండు పార్టీల‌కు లాభం కూడా జ‌రిగింది. అయితే మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. నువ్వు తిట్టిన‌ట్టు చెయ్…!!! నేను కొట్టిన‌ట్టు చేస్తా….!!! అనే రీతిలో చెరో దారిలో వెళ్తున్నాయి. ఈ వేర్వేరు పోటీ వ‌ల్ల ప్ర‌త్య‌ర్థి పార్టీల ఉనికికే ప్ర‌మాదం ఏర్ప‌డుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ గ‌ల్లంత‌వుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన ముంబై కార్పొరేష‌న్ ఎన్నిక‌లే ఇందుకు నిద‌ర్శ‌నం.

227 స్థానాలున్న ముంబై కార్పొరేషన్లో హంగ్ ఏర్పడింది. అధికారం చేపట్టాలంటే కావల్సిన కనీస స్థానాలు 114. ఎవరికీ మ్యాజిక్ ఫిగ‌ర్ రాలేదు. విడివిడిగా పోటీ చేసిన పాత మిత్రులు శివసేన, బీజేపీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగింది. శివసేన 84 చోట్ల , బీజేపీ 81 చోట్ల విజయం సాధించాయి. ఇక కాంగ్రెస్ 31, NCP 9 , MNS 7, ఇతరులు 14 చోట్ల గెలిచాయి. బీఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ 3 స్థానాల‌ను ద‌క్కించుకుంది.

రెండు పార్టీల‌కు మ్యాజిక్ ఫిగ‌ర్ రాక‌పోయిన‌ప్ప‌టికీ రెండు పార్టీల‌కు వ‌చ్చిన స్థానాల‌ను క‌లిపి చూస్తే… దాదాపు మూడోవంతు సీట్లు ఈ రెండు పార్టీల‌కే ద‌క్కాయి. దీనిపై ఇత‌ర పార్టీలు గుస‌గులాడుకుంటున్నాయి. ఈ రెండు పార్టీల మ‌ధ్య ఫైటింగ్… నిజం కాద‌ని ఆయా పార్టీలు అనుమానిస్తున్నాయి. ఎందుకంటే ఈరెండు పార్టీలు త‌మ బ‌లాన్ని మ‌రింత పెంచుకొని… మూడో పార్టీని ఎద‌గ‌కుండా చేయాల‌న్న‌ది అస‌లు వ్యూహ‌మ‌ట‌. ఆ వ్యూహానికి ఇప్పుడు కాంగ్రెస్ చిత్త‌వుతోంది.

బీజేపీ- శివ‌సేన పోటీచేస్తే ఆ రెండు పార్టీల‌కు ప్ర‌త్య‌ర్థి పార్టీగా కాంగ్రెస్ కు సీట్లు బాగానే వ‌చ్చేవి. కానీ బీజేపీ-శివ‌సేన‌… కాంగ్రెస్ కు ఎదిగే అవ‌కాశం ఇవ్వ‌డం లేదు. చాలా తెలివిగా వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. అవ‌స‌ర‌మైతే ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకుంటున్నారు. అందుకే ఇదంతా డ్రామా అంటున్నారు కాంగ్రెస్ నేత‌లు..

ఇప్ప‌టి ముంబై కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో హంగ్ వ‌చ్చింది. బీజేపీ-శివ‌సేన ఒకరికొక‌రు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే త‌ప్ప మేయ‌ర్ స్థానాన్ని పొందే అవ‌కాశం లేదు. అయితే ఫ్రెండ్ షిప్ విష‌యంలో ఈ రెండు పార్టీలు దాగుడు మూత‌లాడుతున్నాయి. ముఖ్యంగా శివ‌సేన అయితే చాలా బెట్టు చేస్తోంది. బీజేపీ నుంచి స్నేహ‌గీతం విన‌బడుతున్నా డోంట్ కేర్ అంటోంది. దీని వెన‌క మేయ‌ర్ సీటును పొందాల‌నే ప్లాన్ ఉంద‌ని టాక్. చివ‌రిగా ఈ రెండు పార్టీలు క‌ల‌వ‌డం ఖాయ‌మ‌ట‌. అయితే ఇప్పుడే క‌లిస్తే ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. … కాబ‌ట్టి కావాల‌నే రోజుల త‌ర‌బ‌డి అది పోస్ట్ పోన్ అయ్యేలా ప్లానేశార‌న్న వాద‌న వినిపిస్తోంది.

ఇక ఇప్ప‌ట్నుంచి ఎన్నిక‌లు ఏవైనా చెరో దారిలో వెళ్లి కాంగ్రెస్ కు దెబ్బ‌కొట్ట‌డమే ఏకైక ఎజెండాగా ఈ రెండు పార్టీలు సెట్ చేసుకుంటున్నాయ‌ట‌. దీంతో ఈ రెండు పార్టీల ప్లాన్ ను ఎలా దెబ్బ‌తీయోలో తెలియ‌క కాంగ్రెస్ ప‌రేషాన్ అవుతోంది. అటు విశ్లేష‌కులు కూడా ఈ ఎత్తుకు అస‌లు పై ఎత్తే లేద‌ని చెబుతున్నారు. ఈ వ్యూహం అంత ప‌క‌డ‌బ్బందీగా ఉంది మ‌రి!!!

Leave a Reply