శివలింగ మూవీ …తెలుగు బులెట్ రివ్యూ

0
830
shivalinga movie telugu bullet review

Posted [relativedate]

shivalinga movie telugu bullet review
ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా రజని బ్లాక్ బస్టర్ చంద్రముఖి,వెంకీ యావరేజ్ మూవీ నాగవల్లి గుర్తుకు తెచ్చుకోవాలి.ఆ రెండు సినిమాలు డైరెక్ట్ చేసిన సీనియర్ దర్శకుడు పి.వాసు ఈ శివలింగకి కూడా దర్శకత్వం వహించాడు.అయితే మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ కావడానికి,రెండో సినిమా తేలిపోవడానికి ఒకటే కారణం..సైకలాజికల్ థ్రిల్లర్ గా వచ్చిన చంద్రముఖి లో దెయ్యం ఏదో ఉందని చెప్పడానికి బిల్డ్ అప్ ఉంటుంది కానీ చివరకు అది ఓ మానసిక సమస్య అని తేల్చేస్తారు.అక్కడే సినిమా పట్టు బిగిసింది.చివరిదాకా దెయ్యం ఉందా ..లేదా అన్న టెన్షన్ ప్రేక్షకుడిని ఉక్కిరిబిక్కిరి చేసింది.ఇక నాగవల్లికి వచ్చేసరికి దెయ్యం ఉందని ముందే తేల్చేసి దాన్ని అడ్డుకోవడం మీద కధ నడిపించసాడు దర్శకుడు పి.వాసు.అందుకే ఆ సినిమా జనాలకి అంతగా ఎక్కలేదు.ఇప్పుడు శివలింగ విషయం లోనూ అదే ఫార్ములా ఫాలో అయ్యాడు దర్శకుడు.ఆ ఫలితం ఎలా వుందో తెలుసుకోడానికి శివలింగ చిత్రాన్ని విశ్లేషిద్దాం.

కధ…ఓ cid అధికారి ఒక హత్యకేసుని ఛేదించే క్రమంలో ఎదుర్కొనే ఇబ్బందులు,భార్యని కూడా ప్రమాదంలో నెట్టే పరిణామాలు…చివరికి హంతకుడెవరో తెలిసిందా?అతడిని పట్టుకోవడంలో చనిపోయిన వ్యక్తే విచారణకు ఎలా సహకరించాడు ? దీని చుట్టూ అల్లుకున్న కధే శివలింగ.
కధనం…ఓ క్రైమ్ థ్రిల్లర్ ,హారర్ జానర్ కలిపితే ఎలా ఉంటుందో శివలింగ అలా ఉంటుంది.కానీ రెండు జానర్స్ మిక్స్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి.స్క్రీన్ ప్లే టైట్ గా ఉండాలి.కానీ ఇంతకుముందు సక్సెస్ అయిన ఫార్ములానే పట్టుకుని సినిమా ఈదాలన్న ప్రయత్నం జరిగింది.దీంతో కధ ఎత్తుగడ బాగుందనిపించినా,కధనం సాదాసీదాగా సాగిపోయింది.

దర్శకుడు పి.వాసు చేసిన ప్రయత్నానికి లారెన్స్ అండగా నిలిచాడు.ఈ తరహా చిత్రాల్లో నటించి,దర్శకత్వం కూడా వహించిన అనుభవం వున్న లారెన్స్ దీంట్లోనూ అవలీలగా తన పాత్ర పోషించాడు.అయితే కధ,కధనాలు మాత్రం లారెన్స్ కి ఎక్కడా అండగా నిలవలేకపోయాయి.కామెడీ మరీ పేలవంగా అనిపించింది.మొత్తానికి శివలింగ అక్కడక్కడా బాగుంది..అక్కడక్కడా బాగాలేదు అనిపించే సినిమాగా మిగిలిపోయింది.

పంచ్ లైన్ … “శివలింగ” పూజలో హడావిడి ఎక్కువ ..భక్తి తక్కువ .
రేటింగ్ …  2 .5 /5

Leave a Reply