‘శాతకర్ణి’లో సూపర్ స్టార్ ?

0
407
shivaraj kumar in balakrishna goutami putra satakarni movie

 Posted [relativedate]

shivaraj kumar in balakrishna goutami putra satakarni movieనంద‌మూరి బాల‌కృష్ణ వందో చిత్రం ‘గౌత‌మీ పుత్ర శాత‌క‌ర్ణి’. ఈ చారిత్రాత్మక చిత్రం కోసం ప్రతిదీ పక్కగా ప్లాన్ చేసుకొన్నాడు ద‌ర్శ‌కుడు క్రిష్.అన్ని విషయాల్లోనూ భారీతనం చూపిస్తున్నాడు. మొరాకో, జార్జియా లాంటి దేశాలకు వెళ్లి అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ చేసుకొని వచ్చాడు.

శాతకర్ణి కోసం కబీర్ బేడి లాంటి ఇంటర్నేషనల్ యాక్టర్ తో పాటు..  బాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ హేమమాలినిని బాలయ్య తల్లి పాత్రకు తీసుకున్నాడు.తాజాగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ను ఓ కీలక పాత్రలో చూపించబోతున్నట్లు సమాచారమ్.బాలయ్యకు శివరాజ్ కి మధ్య మంచి అనుబంధం ఉంది.ఇటీవలే శివరాజ్ సినిమా ‘శివలింగ’ 100 రోజుల వేడుకకు బాలయ్య హాజరయ్యారు.శాతకర్ణి లోని పాత్ర గురించి బాలయ్య చెప్పగానే శివరాజ్ ఓకే చెప్పాడట.త్వరలోనే ఈ సూపర్ స్టార్ పై సన్నివేశాలని చిత్రీకరించనున్నారట.

ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రియ జతకట్టనుంది.ఈ చిత్రం దాదాపు 70కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.ఇప్పటికే దాదాపు 80 శాతం షూటింగ్ ని శాతకర్ణి పూర్తి చేసుకొన్నాడు. మిగిలిన షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా శాతకర్ణిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Leave a Reply