బాబాయ్..అబ్బాయ్ మాట కలిసింది…మరి మనసు?

   shivpal singh yadav akhilesh yadav meet together
యూపీ ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్నా అధికార సమాజ్ వాది పార్టీలో విభేదాలు సద్దుమణగలేదు.రెండు అధికార కేంద్రాల మధ్య నడుస్తున్న యుద్ధం కొనసాగుతూనే వుంది.సీఎం అఖిలేష్ ,అయన బాబాయ్ శివపాల్ సింగ్ యాదవ్ ల మధ్య విభేదాలు అలాగే ఉన్నట్టు కనిపిస్తున్నాయి.ఇటీవల శివపాల్ రాజీనామా హెచ్చరికతో పార్టీ అధినేత ములాయం అలర్ట్ అయ్యారు.తమ్ముడి మాట పట్టించుకోకుండా వ్యవహరిస్తే పార్టీలోచీలిక వస్తుందని కొడుక్కి హితబోధ చేశారు.

ఈ నేపథ్యంలో లక్నోలోని సీఎం అఖిలేష్ అధికారిక నివాసంలోనే బాబాయ్,అబ్బాయ్ సమావేశమయ్యారు.దాదాపు గంటసేపు ముఖాముఖీ మాట్లాడుకున్నారు.శాంతిభద్రతలు ,ఎన్నికల వ్యూహం,అభ్యర్థుల ఎంపిక వంటి అంశాల్లో ఇద్దరూ దృష్టి పెట్టారు.శివపాల్ చేసిన సూచనల్ని అఖిలేష్ పరిశీలిస్తానన్నారు.బయటకు వచ్చిన శివపాల్ అఖిలేష్ పై ప్రశంసలు కురిపించారు.వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ములాయం హెచ్చరికలతో భేటీ అయిన బాబాయ్,అబ్బాయ్ ల మధ్య అభ్యర్థుల ఎంపిక విషయంలో విభేదాలు సమసిపోలేదని కొన్ని గంటల్లోనే అర్ధమైంది.అఖిలేష్ ఈ విషయంలో భార్య మాటకే విలువిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి .సమస్య ముదరకుండా నేరుగా ఇద్దరి మధ్య రాజీ కుదర్చాలని సమాజ్ వాది శ్రేణులు భావిస్తున్నాయి.

SHARE