పవన్ ని టార్గెట్ చేసిన ఎస్పీ ..

 Posted October 26, 2016

shivpal yadav target on minister pawan pandey uttar pradeshయూపీ రాజకీయ రణక్షేత్రంలో తలపడుతున్న బాబాయ్…అబ్బాయి మధ్య రాజీ కుదిరిందని ఎస్పీ జాతీయ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ప్రకటించారు. కానీ …కథ అక్కడితో ముగిసిపోలేదు..నిన్నటిదాకా జరిగిన పోరాటంలో సీఎం అఖిలేష్ కి నమ్మిన బంటులా ఉన్న మంత్రి పవన్ పాండే ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరణ వేటు వేస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ నిర్ణయం తీసుకున్నారు.రణగొణ ధ్వనుల మధ్య మొన్న జరిగిన పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ ఆశుమాలిక్ మీద పవన్ దాడికి పాలడ్డారని పార్టీ అభియోగం.ఇదే విషయాన్ని చెబుతూ అఖిలేష్ కి శివపాల్ లేఖ రాశారు.ఆయన్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని కోరారు.యూపీ ఎస్పీ పవన్ ని టార్గెట్ చేయడంతో కథ మళ్లీ మొదటికొస్తుందన్న అనుమానాలున్నాయి.దీనిపై అఖిలేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.

SHARE