మహేష్‌బాబు సోదరుడి గురించి షాకింగ్‌ పుకార్లు

0
517
shocking news about ramesh babu

Posted [relativedate]

shocking news about ramesh babu
సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకునే హీరోగా దూసుకు పోతున్నాడు. మరో వైపు పలు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. వీటితో పాటు పలు బిజినెస్‌లలో కూడా మహేష్‌బాబు పెట్టుబడి పెడుతున్నాడు. ఒక వైపు మహేష్‌బాబు ఇంతగా దూసుకు పోతుంటే ఆయన సోదరుడు రమేష్‌బాబు మాత్రం ఉన్నదంతా ఊడ్చి పెట్టేశాడట. అప్పట్లో హీరోగా నటించిన రమేష్‌బాబు కొంత కాలంకు నిర్మాతగా మారాడు. కొన్ని సినిమాలను డిస్ట్రిబ్యూషన్‌ చేశాడు.

ఎందులో కూడా రమేష్‌బాబు నిలదొక్కుకోలేక పోయాడట. పైగా రమేష్‌బాబుకు చెడు వ్యసనాలు కూడా చాలా అధికంగా ఉన్నాయట. దాంతో రమేష్‌ బాబు ఆర్థికంగా పూర్తిగా క్షిణించి పోయాడని, ఆయన కుటుంబం ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటుందంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇటీవలే మహేష్‌బాబు వద్దకు రమేష్‌ బాబు వెళ్లి సాయం కోరాడనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సూపర్‌ స్టార్‌ కృష్ణ కొడుకు అయ్యి ఉండి, ఆ క్రేజ్‌ను రమేష్‌బాబు వాడుకోవడంలో విఫలం అయ్యాడు. పైగా చెడు అలవాటు, ప్రతిభ లేక పోవడంతో ఇప్పుడు కుటుంబంను ఇబ్బందుల్లో పడేశాడు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా సూపర్‌ స్టార్‌ కొడుకు, సూపర్‌ స్టార్‌ అన్న అయిన రమేష్‌బాబు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఆయన పరిస్థితిని చూసి అయ్యో పాపం అంటున్నారు సినీ జనాలు.

Leave a Reply