శాతకర్ణి.. ఓ షాకింగ్ న్యూస్ !

 Posted October 31, 2016

shocking news about sathakarniనందమూరి బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయ్. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ బిజెనెస్ అదరిపోయింది. అయితే, ఇపుడు శాతకర్ణి గురించి ఓ షాకింగ్ న్యూస్ ప్రచారం జరుగుతోంది. ఈ న్యూస్ డిస్ట్రిబ్యూటర్స్ ని హడలెత్తిస్తోంది.చారిత్రాత్మక నేపథ్యం గల ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత ప్రధానం. ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పని చేస్తే ఆ రేంజ్ వేరే. ‘బాహుబలి’లాంటి అవుట్ పుట్ రావడం ఖాయం. అయితే, శాతకర్ణి కోసం మాత్రం హైదరాబాద్ టెక్నీషియన్స్‌ ని తీసుకొన్నారంట. దీంతో.. సరైన క్వాలిటీ రావడం లేదట. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ప్రచారాన్ని చూసి డిస్ట్రిబ్యూటర్స్ హడలిపోతున్నట్టు సమాచారమ్. మరి..ఇందులో నిజమెంత అనేది శాతకర్ణి చిత్రబృందం క్లారిటీ ఇస్తే మంచిది.

SHARE