భావన కేసులో బయటపడుతున్న షాకింగ్ విషయాలు..!!

0
346
shocking news knowing on bhavana kidnap and molestation case

Posted [relativedate]

shocking news knowing on bhavana kidnap and molestation caseమాలీవుడ్ హీరోయిన్ భావన కిడ్నాప్ తో దేశవ్యాప్తంగా ఫిల్మ్ ఇండస్ట్రీలన్నీ  ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ కిడ్నాప్ వెనకు ఎవరెవరి హస్తం ఉందో కూపీ లాగుతున్నారు. ఈ కిడ్నాప్ వెనుక మొత్తం ఏడుగురు సభ్యులు ఉండగా ఇప్పటివరకు ముగ్గురి అరెస్ట్ చేశారు. ప్రధాననిందితుడైన ఆమె కార్ డ్రైవర్ సునీల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. కాగా పట్టుబడ్డవారు పోలీసు విచార‌ణ‌లో  షాకింగ్ విషయాలను బయటపెడుతున్నారు.

ఈ కిడ్నాప్ వెనుక ఓ ప్రముఖ హీరో హస్తం ఉందని సమాచారం. భావ‌న  కార్ డ్రైవ‌ర్ సునీల్ సదరు  హీరోతో రూ. 30లక్షలకి డీల్ కుదుర్చుకుని మ‌రీ ఈ దురాగ‌తానికి పాల్ప‌డ్డాడ‌ని పోలీసులు చెబుతున్నారు. గతంలో భావనతో గొడవపెట్టుకున్న హీరో దిలీప్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో భావన ఈ  ఈ  హీరోకి క్లోజ్ ఫ్రెండ్. ఒకానొక టైంలో భావన ఈ హీరోని  పెళ్లి చేసుకోబోతోందని  రూమర్లు కూడా వచ్చాయి. అయితే అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.  వారిద్దరి మధ్య భావన వల్ల  గొడవలు రావడంతో సదరు హీరో ఆ అమ్మాయికి విడాకులు కూడా ఇచ్చేసి కావ్య మాధవన్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. విడాకుల సమయంలో భావన అతని భార్యకు సపోర్ట్ చేయడంతో దిలీప్.. భావనపై కక్ష్యకట్టి ఇదంతా చేయించాడని పోలీసుల కధనం.

అలాగే ఈ కిడ్నాప్ వెనుక మలయాళ నిర్మాత ఆంటో జోసెఫ్ కూడా ఉన్నట్లు, కార్ డ్రైవర్ సునీల్ కి ఈ నిర్మాతకి సంబంధాలు ఉన్నట్లు  గత రెండు రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై స్పందించిన సదరు నిర్మాత… తనకు, ఈ కిడ్నాప్ కి ఎలాంటి సంబంధంలేదని ప్రకటించాడు.  భావన పట్ల జరిగిన దురాగతం  గురించి తెలుసుకున్న తాను… కొత్తగా పనిలోకి వచ్చిన  కార్ డ్రైవర్ నుండి సునీల్ నెంబర్ తీసుకుని ఫోన్ చేశానని, అయితే సునీల్ ఫోన్ లిఫ్ట్ చేయలేదని వివరించాడు. ఆ తర్వాత సునీలే కాల్ బ్యాక్ చేసి నువ్వెవరు అని అడిగాడని, తాను నిర్మాత ఆంటో జోసెఫ్ అని చెప్పడంతో ఫోన్ పెట్టేశాడని తెలిపారు. అంతకు మించి అతనితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.

ఇలారోజుకో విషయం వెలుగు చూస్తున్న భావన కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకెన్ని షాకింగ్ విషయాలు బయటపడతాయో చూడాలి.

Leave a Reply