Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘జై లవకుశ’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కు అద్బుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్న నేపథ్యంలో సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకుని ఉన్నారు. ఇక ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అంటూ ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘జై లవకుశ’ టీజర్ డేట్ ఫిక్స్ అయ్యింది. రంజాన్ సందర్బంగా ఈ నెల 21న విడుదల చేయాలని నిర్ణయించారు. అందుకోసం ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేసేందుకు ఈ టీజర్‌ను అద్బుతంగా కట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ మొదటి వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే సెప్టెంబర్‌లో బాలయ్య 101వ సినిమాతో రాబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. మహేష్‌బాబు కూడా దసరా కానుకగా సెప్టెంబర్‌లో రాబోతున్నాడు. వారిద్దరితో పాటు ఎన్టీఆర్ కూడా సెప్టెంబర్‌లోనే రానున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద పెద్ద వార్ జరిగే అవకాశమే ఉంది.