Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎక్కడైనా అన్నం ముద్దని నేలకేసి కొడితే బంతిలా ఎగురుతుందా ? కానీ ఎగిరింది.ఈ వింత జరిగింది ఎక్కడో కాదు.హైదరాబాద్ నడిగడ్డ మీద.అసలు అన్నం ముద్దని బంతిలా ఎగరేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో?అదెలా జరిగిందో తెలుసుకుంటే మీరు నోరెళ్లబెట్టడం ఖాయం.
ఇప్పటికే పాలు,పచారీ సరుకులు కల్తీ అవుతున్నట్టు వింటున్నాం.చూస్తున్నాం.ఇప్పుడు ఇక ఇప్పుడు బియ్యం వంతు కూడా వచ్చింది. ప్లాస్టిక్ బియ్యం అనేది ప్రచారమే అనుకుంటే అది మార్కెట్ లోకి ఎంటర్ అయిపోయి జనాల ఆరోగ్యంతో ఆడుకుంటోంది. అశోక్ కుమార్ అనే వ్యక్తి మీర్ పేట ,నందనవనంలోని ఓ కిరాణా షాపులో బియ్యం కొనుగోలుజేసాడు.ఆ బియ్యంతో అన్నం వండగా ఏదో తేడాగా అనిపించింది.అంతే ఆ వండిన అన్నాన్ని ఓ ముద్దగా చేసి బండకేసి కొడితే అది బంతిలా ఎగిరింది.దీంతో అతను దుకాణదారుడు మీద పోలీసులకి ఫిర్యాదు చేసాడు.రంగంలోకి దిగిన పోలీసులు ఆ దుకాణదారు మీద కేసు పెట్టి విచారణ సాగిస్తున్నారు.
అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోనూ కొన్ని దుకాణాల్లో ప్లాస్టిక్ బియ్యం తో అసలు బియ్యాన్ని కల్తీ చేసి అమ్ముతున్నారు.ఆ బియ్యం వండి నప్పుడు కూడా వాటి ముద్దలు ఇలాగే ప్లాస్టిక్ బంతుల్లా ఎగురుతున్నాయి. ఈ కల్తీ వ్యవహారాన్ని పసిగట్టలేక ఎవరైనా ఆ అన్నాన్ని తింటే కడుపునొప్పితో ఆస్పత్రి పాలవుతున్నారు.వరసగా వస్తున్న ఫిర్యాదులతో ఇప్పుడిప్పుడే పౌరసరఫరాల శాఖ అప్రమత్తం అవుతోంది.