తిరుమలలో స్వైప్ మిషన్లు..”అంగట్లో “బ్యాంకుల ఆఫర్స్

Posted November 28, 2016, 4:45 pm

Image result for ebanking

ఎలక్ట్రానిక్ మనీ ట్రాన్స్ఫర్, నగదు రహిత లావాదేవాలను ప్రోత్స హించేందుకు ప్రభుత్వం తీసుకొంటున్న చర్యల్లో భాగం గా బ్యాంకులు స్వైప్ మిషన్లను, పాయింట్ అఫ్ సేల్ మిషన్లను అందించేందుకు బ్యాంకు లు బంపర్ ఆఫర్ లను ఇస్తున్నాయట.పేపర్ రోల్స్ దగ్గర నుంచి మెయింటెనెన్స్ వరకు అన్ని సౌకర్యాలను ఉచితం గా కల్పిస్తామని తెగ ఆరాట పడుతున్నాయట .పాన్ డబ్బా నుంచి మొదలుకొని ప్రతి ఒక్క చోటు ఈ యంత్రాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యం తో వున్నాయట పోస్ యంత్రా లు పూర్తిస్థాయి లో అమల్లోకి వస్తే రానున్న రోజులలో ఒక్క డెబిట్ కార్డు తో ఏదైనా చేసే అవకాశం కలుగనుంది .

ప్రజా పంపిణీ వ్యవస్థలో కూడా నిత్యావసరాలను క్యాష్‌లెస్‌ విధానంలోనే అందిచాలని నిర్ణయించారు. ఈ విధానం మరో నెల రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతోంది. అసంఘటిత రంగంలో కూడా అమలు పరచాలని భావిస్తున్నారు. ప్రజల్లో కూడా అవగాహన తీసుకు రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానం లో భక్తులకు అసౌకర్యం కలుగ కుండా ఉండేందుకు అన్ని చర్యలను తీసుకున్నారు ఆలయ ఈ ఓ సాంబశివరావు 23 చోట్ల స్వైప్ మిషన్లను ఏర్పాటు చేశామని చెప్పారు.ప్రసాదం ,వసతి ,తదితర రద్దీ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశామన్నారు ..