బాలయ్య కోసం శ్రియ,ఛార్మి పోటీ?

Posted April 5, 2017

shreya and charmi trying to chance for balakrishna movie
బాలయ్య 101 వ సినిమాలో ఓ ప్రధాన పాత్ర కోసం ఇద్దరి మధ్య పోటీ మొదలైంది.సీనియర్స్ కోటాలో ఛాన్స్ కొట్టేస్తున్న శ్రీయ తో ఈసారి ఇంకో హీరోయిన్ పోటీ పడుతోంది.ఆమె ఛార్మి.దర్శకుడు తన టీం లో ప్రొడక్షన్, కాస్టింగ్ ఏర్పాట్లు చూసుకుంటున్న ఛార్మి కి ఇంకో అవకాశం ఇద్దామని పూరి అనుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.అయితే నిర్మాత,హీరో మాత్రం ఆ పాత్రకి శ్రీయ అయితే బాగుంటుందని భావిస్తున్నారట.ఈ విషయం మీద ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట.

బాలయ్య మాఫియా డాన్ గా చేస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే ఓ హీరోయిన్ గా ముంబై భామ ముస్కాన్ కి ఛాన్స్ దక్కింది.ఆమెతో పాటు ఇంకో ఇద్దరు హీరోయిన్స్ కి కీలక పాత్రలు ఉన్నట్టు తెలుస్తోంది.అందులో అతి ముఖ్యమైన పాత్ర కోసమే ఇప్పుడు ఛార్మి,శ్రేయ పోటీ పడుతున్నారు. ఒకవేళ మూడో పాత్రకి ఈ ఇద్దరిలో ఒకరు సరిపోతారు అనుకుంటే బాలయ్య సరసన మళ్లీ శ్రీయ,ఛార్మి కనిపిస్తారన్నమాట.

SHARE