గౌతమి ఎపిసోడ్ లో శృతికి హక్కు లేదా?

 Posted November 2, 2016

shruthi hassan said about kamal hassan and gouthami part ways
కమల్ హాసన్,గౌతమి విడిపోవడం వెనుక శృతి హాసన్ కారణమని బలమైన వాదన వినిపిస్తోంది.అయితే అసలు గుట్టేమిటో అందులో ఇన్ వాల్వ్ అయ్యిన వాళ్ళెవరూ చెప్పడానికి ఇష్టపడడం లేదు.ఇప్పుడు శృతి హాసన్ గొంతు విప్పినా అసలు విషయం బయటపడకుండా జాగ్రత్తపడింది. తాను ఎవరి వ్యక్తిగత జీవితంపై,నిర్ణయాలపై మాట్లాడలేనని శృతి చెప్పారు.తనకు ఆ హక్కు లేదని శృతి వివరించారు.ఇంతకు ముందు శెభాష్ నాయుడు షూటింగ్ టైం లో దుస్తుల ఎంపికలో ఇద్దరి మధ్య గొడవ వచ్చిందని వార్తలు వచ్చినపుడు కూడా శృతి దాదాపుగా ఇదే రీతిలో స్పందించారు. తాజా ఎపిసోడ్ తర్వాత మాత్రం ఒక్క విషయాన్ని అదనంగా మాట్లాడారు.తనకి తల్లిదండ్రులు,చెల్లెలు ముఖ్యమని చెప్పారు.అంటే గౌతమి కి తన జీవితంలో అంత ప్రాధాన్యం లేదని చెప్పకనే చెప్పారు.

SHARE