శృతి హాసన్ ని బెదిరించినదెవరు?

Posted November 11, 2016

shruti haasan files case on doctor
ప్రముఖ సినీ నటి శృతిహాసన్ బెదిరింపులకు గురయ్యారు.అతగాడు వట్టి ఆకతాయి అనుకునేరు …..వైద్యవృత్తిలో కొనసాగుతున్న పరమ ఆకతాయి.కర్ణాటకలో వైద్యుడిగా పని చేస్తున్న ఇతని పేరు కే.జి.గురు ప్రసాద్.సెప్టెంబర్ 7 నుంచి ఈ వైద్యుడి దగ్గర నుంచి శృతికి వేధింపులు మొదలయ్యాయి.గురుప్రసాద్ ట్విట్టర్ ఖాతా ద్వారా శృతి కి అసభ్యకర సందేశాలు పంపడం,బెదిరించడం …చివరకు చంపుతానని హెచ్చరించడం దాకా రెచ్చిపోయాడు ఈ డాక్టర్ .దీంతో శృతి పోలీసుల్ని ఆశ్రయించారు.ఆమె తరపున ప్రవీణ్ అనే ప్రతినిధి పోలీసుల్ని కలిసి ఫిర్యాదు చేశారు.

SHARE