శృతి హాసన్ ‘బిచ్‌’…

Posted October 15, 2016

 shruti haasan shoot be the bitch video song

హీరోయిన్ శ్రుతిహాసన్‌ ఆల్ రౌండర్ అన్న విషయం తెలిసిందే. సంగీతం, పాటలు, కథలు, కవితలు రాయడం శృతికి అలవాటు. తాజాగా, త‌నను భాధ పెట్టిన
సంఘటలన్నింటిని పేపర్ మీద పెట్టేసింది. దాన్ని ”బి ది బిచ్” అంటూ ఒక వీడియో రూపంలోకి తెచ్చింది. ఇపుడీ వీడియో ఆన్‌లైన్‌లో సంచలనం రేపుతోంది.

‘బిచ్.. చాల మంది జీనియస్ మైండ్స్ మమ్మల్ని ఇలా ఒక్క పదంతో తీసిపారెస్తారు. బిచ్ అంటే ఎవరు? బిచ్ ఓ మల్టీ టాస్కర్ . బిచ్ ఓ టీచర్. బిచ్ హార్మోన్లతో నిండిన అమ్మాయి… ఇలా ఆ పదానికి అర్ధం చెబుతూ..  ఇన్ దట్ వే.. ఎస్.. ఐయామ్ ఎ బిచ్’ అంటూ శ్రుతి హాసన్ రూపొందించిన వీదియోపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ శృతి ‘బిచ్’ షేర్ చేస్తున్నారు. ఇప్పుడీ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

ఇంతకీ శృతి ‘బిచ్’ సాంగ్ ఎందుకు చేసినట్టు అంటే..  ఓ సారి ముంబై సెంట్రల్ స్టేషన్లో శృతికి చేదు అనుభవం ఎదురైందట. పొరబాటున ఎదురుగా ఉన్న ఓ లేడీకి
తగలడం.. సారీ చెప్పే లోపే ఆమె శృతిని ‘బిచ్’ అంటూ అనకూడని మాట అనేయడం జరిగిందట. ఆ పదానికి అర్థం తెలిసిన వాళ్లేవరూ అంత త్వరగా వాడరు. అలాంటిది ఓ మహిళ ఇంకో మహిళని అలా ఎలా తిడుతుందంటూ శృతి చాలా హర్ట్ అయిందట. అందుకే ‘బిచ్’పై.. ఇలా రియాక్ట్ అంటోంది.

[wpdevart_youtube]ntcs-iU6ArU[/wpdevart_youtube]

SHARE