ర‌ణ‌బీర్ తో డేటింగ్ ముచ్చట్లు చెప్పిన శృతి

 Posted October 18, 2016

shruti hassan clarity about ranbir kapoor dating 

ఈ మధ్య ముద్దుగుమ్మ శృతి హాసన్ పై గాసిప్ ల గోల ఎక్కువైంది. బాలీవుడ్ లవ్వర్ భాయ్ ర‌ణ‌బీర్ కపూర్ శృతిహాసన్ ఎఫైర్ నడుపుతుందంటూ.. జోరుగా
ప్రచారం జరుగుతోంది. అదే రేంజ్ లో ఉందంటే.. ? గాసిప్ లపై పెద్దగా స్పందించన శృతి కూడా స్పందించే రేంజ్ లో సాగింది. ఈ ప్రచారానికి పులిస్టాప్ పెట్టాలని భావించిన శృతి ర‌ణ‌బీర్ తో డేటింగ్ ముచ్చట్లపై క్లారిటీ ఇచ్చింది.

మేమిద్ద‌రం క‌ల‌సి ఒక వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లో న‌టించామ‌ని.. ఆ త‌ర్వాత తాము క‌లిసింది లేద‌ని పేర్కొంది.. ఆ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల ఫోట‌లతో త‌మ ఇద్ద‌రికి లింక్ లు పెట్టి గాసిప్స్ రాయ‌డం త‌గ‌ద‌ని చెప్పుకొచ్చింది. ఇంతకు మించి మా మధ్య మరేమీ లేదని.. త‌న‌కు,ర‌ణ‌బీర్ కపూర్ కు మ‌ధ్య వ్య‌వ‌హారం ఉందంటూ మీడియాలో వ‌స్తున్న వార్తాల‌ను అమె ట్రాష్ గా కొట్టిప‌టేసింది. గాసిప్ రాయుళ్లు మాత్రం నిప్పులేనిదే పొగరాదు కదా..! అంటూ గుసగుసల్లాడుతున్నారు. మరి.. శృతి క్లారిటీ ఇప్పటికైనా రణ్ బీర్ కపూర్ తో శృతి ఎఫైర్ ముచ్చట్లకి ముగింపు పలుకుతుందో.. చూడాలి.

SHARE