సిద్దు….ముద్దు…భూతద్దం

     sidda ramayya karnataka cm girl kissed

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అంతా ఎదురొస్తోంది.రెబల్ స్టార్ అంబరీష్ నాయకత్వంలో ఓవైపు అసంతృప్తి వాదులు రగిలిపోతున్నారు…MLA ల రాజీనామా వ్యవహారం ఎక్కడిదాకా వెళుతుందో తెలియకుండా ఉంది.అంతలో బిపాసాబసు వ్యవహారం …యోగా చేసినందుకు ఆమెకు కోటిన్నర ఇవ్వడమేంటని విమర్శలు వెల్లువెత్తాయి..

దాన్ని మర్చిపోతారులే అనుకునే లోపే మరోవిషయం అదీ బెంగుళూర్ ప్యాలస్ మైదానం సాక్షిగా ఓ పంచాయితీ వార్డ్ మెంబెర్ సీఎం సిద్దరామయ్యను ముద్దుపెట్టుకోవడం …..ఎప్పటినుంచో అభిమానిస్తున్న నాయకుడ్ని దగ్గరగా చూడగానే తండ్రిలా భావించి ముద్దుపెట్టుకున్నట్టు గిరిజా శ్రీనివాస్ అనే ఆ మహిళా వివరణ కూడా ఇచ్చింది.కొందరు నోరు చేసుకుంటూనే వున్నారు.

67 వయసున్న ఓ పెద్దాయన …తండ్రి లా భావిస్తున్న ఓ మహిళ…చుట్టూ వేలమంది జనం .ఈ నేపధ్యంలో ఓ మహిళ భావోద్వేగంతో వ్యవహరిస్తే దానికి కూడా సీఎంను తప్పు బడితే ఎలా?ఆ విమర్శలు చేసే వాళ్ళు ముందు మీ కళ్ళ ముందున్న బూతుల భూతద్దాన్ని పక్కనపెడితే మంచిది..

Leave a Reply