సిద్ధార్థ మూవీ రివ్యూ..

 siddhartha movie review
చక్రవాకం, మొగలి రేకులు లాంటి ఎమోషనల్ డైలీ సీరియళ్ళలో బలమైన పాత్రల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాగర్. మొదటిసారి హీరోగా పరిచయమవుతూ చేసిన సినిమా ‘సిద్దార్థ’. దయానంద్ రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన  ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్ళాల్సిందే .హీరో సూర్య ఇండియా నుండి మలేషియా వెళుతున్న సమయంలో సహస్ర  ని చూసి లవ్ లో పడతాడు . సూర్య సహస్రకు తన గతం తెలీనీకుండా తనని తాను సిద్దార్థగా పరిచయం చేసుకుంటాడు. .సూర్య తన తన చేదు గతాన్ని ముగించి సహస్రతో కొత్త, ప్రశాంతమైన జీవితం గడపాలన్న ఉద్దేశ్యంతో తన సమస్యలను పరిష్కరించుకోడానికి సొంత ఊరికి వెళతాడు. కానీ అక్కడ సూర్య ఊహించని విధంగా తన ప్రేమను త్యాగం చేయాల్సి వస్తుంది. సహస్ర కూడా సూర్య మంచి కోసం అతనికి దూరమవుతుంది. సూర్య తన ప్రేమను ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది ?వీరి ప్రేమ కధ ఏ మలుపు తిరిగింది ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
ఈ సినిమా కద పాతదైన కధనం మాత్రం కొత్త గా వుంది.ఫస్ట్ హాఫ్ రొమాంటి సీన్స్ ఆకట్టుకునే ఈ సినిమా లో సాగర్ ప్లెస్ పాయింట్ అని చెప్పాలి.సీరియల్ యాక్టర్ గా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయిన సాగర్ సూర్య పాత్రతో మరింత దగ్గరయ్యాడు. చేదు గతం వెంటాడే మనిషి ఎలాంటి బాధను అనుభవిస్తాడు అనేదాన్ని చాలా స్పష్టంగా తన నటనలో చూపాడు.ఇక హీరోయిన్ రాగిణి నంద్వాని క్యూట్ గా బాగా నటించింది.రోమాంటిక్ సీన్స్ లోనూ బాగా నటించింది. సాక్షి చౌదరి పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. అజయ్‌.. సుబ్బరాజు.. కోట శ్రీనివాసరావు.. రణదీప్‌ కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. సత్యం రాజేష్‌.. తాగుబోతు రమేష్‌ గ్యాంగ్‌ ద్వితీయార్థంలో పండించే నవ్వులు కాస్తలో కాస్త రిలీఫ్‌. .ఎమోషనల్ సీన్స్ కూడా బాగా పండించింది.
హీరో సినిమాకు ప్లస్ పాయింట్ అయినా  ఫస్ట్ పార్ట్ లో హీరో హీరోయిజమ్ చూపించి సెకెండ్ హాఫ్ లో హీరో రోల్ ని డల్ చేసి నిరుత్సాహ పరిచాడు డైరెక్టర్ . కమర్షియల్, యాక్షన్ ఎంటర్టైనర్ అన్నారేగాని సినిమాలో పెద్దగా యాక్షన్ సీక్వెన్సులు లేకపోవడంతో కథనంలో దమ్ము లేకపోవటం ఆడియన్స్ ను నిరాశ పరిచింది.సినిమా లో మరో పెద్ద మైనస్ పాయింట్ బోరింగ్ స్క్రీన్ ప్లే  అండ్  రొటీన్ క్లైమాక్స్ .కధ లో కూడ వేగం ఉండదు. సినిమా 2 గంటల 6 నిమిషాలే అయినా చాలా సన్నివేశాలు భారంగా సాగుతున్నట్టు అనిపిస్తాయి.మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటల సంగీతం ఫర్వాలేదు అనిపిస్తుంది,. ఎస్ గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బాగుంది. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ సినిమాను చాలా రిచ్ గా నిర్మించాడు.ఏదేమైనా హీరోగా నిలబడాలనుకున్న సాగర్ కు మాత్రం మంచి స్టార్ట్ ఇచ్చాడనే చెప్పాలి.
ట్యాగ్ లైన్ : మరో సీరియల్
రేటింగ్ : 2./5
SHARE