అతిగా నిమ్మరసంతాగితే ఇంతే …

0
493
Side Effects of Drinking Too Much Lemon With Water

Posted [relativedate]

Side Effects of Drinking Too Much Lemon With Water

విటమిన్ ‘C’ అధికంగా కలిగి ఉందనే నిమ్మ సారిన్ స్థాయిలో ఆరోగ్యానికి మంచిదే. కానీ అధిక మొత్తంలో విటమిన్ ‘C’ తీసుకోవటం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

జీర్ణాశయంలో ఆమ్ల గాఢత అధికం అవటం వలన అల్సర్ లు కలుగుతాయి. అలాగే ఆమ్ల గాడత కలిగి ఉండే నిమ్మరసాన్ని తీసుకోవటం వలన పొట్టలో ఆమ్ల గాడతలు పెరిగి, జీర్ణాశయ మరియు పేగుల అంతర్గత పొర దెబ్బ తింటుంది. కావున అధిక మొత్తంలో నిమ్మరసం కూడా అల్సర్ కు గురి చేస్తుంది.

నిమ్మరసాన్ని తాగటమే కాకుండా వంటలలో కూడా వాడతుంటాము. నిమ్మ తోక్కలలో ఆక్సాలేట్ అధికంగా ఉంటుంది. నిమ్మకాయని పిండినపుడు ఈ మూలకం కూడా ఆహరం లేదా నిమ్మరసం ద్వారా మన శరీరంలోకి చేరుతుంది. ఈ ఆక్సలేట్ మన శరీరంలో కాల్షియం శోషణకు అంతరాయం ఏర్పరచి, పిత్తాశయం, మూత్రపిండాలలో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.

నిమ్మరసం లేదా నిమ్మ నేరుగా దంతాలకు తాకటం వలన వాటిలో ఉండే సిట్రిక్ ఆసిడ్ మరియు ఆస్కార్బిక్ యాసిడ్ దంతాల పై పొర అయినట్టి ఎనామిల్ ను ప్రమాదానికి గురి చేస్తాయి. ఫలితంగా, క్యావిటీ, దంత కణాలు దెబ్బతినటం లేదా దంతాల రంగు మారటం మరియు దంతక్షయం వంటి సమస్యలు కలుగుతాయి.

మన జీర్ణాశయంలో అన్ని ఆహార పదార్థాలు జీర్ణం అవవు. ఉదాహహరణకు- నిమ్మరసాన్ని ఇతర ఆహార పదార్థాలతో తీసుకోవటం వలన త్వరగా జీర్ణం అవుతుంది కానీ, నేరుగా కేవలం నిమ్మరసాన్ని తీసుకోవటం వలన జీర్ణాశయంలో ఆమ్ల గాడతలు అధికం అవటం వలన జీర్ణాశయంలో అవాంతరాలు ఏర్పడి, కడుపులో కలతలకు కారణం అవుతుంది.సో అధికం గా నిమ్మ తీసుకోకండి

Leave a Reply