కేజ్రీవాల్ ని సెవెన్ కొట్టిన సిద్ధూ..

0
721

 sidhu fires kejriwal
రాజకీయం ఎంత చిత్రమో కదా! నిన్నమొన్నటిదాకా ఆప్ లో చేరాలని సిద్ధూ ఉవ్విళ్ళూరాడు.ఏకంగా కేంద్రంలో అధికార పక్షం బీజేపీ కి రాజీనామా చేసి మరీ వచ్చాడు.ముందుగా ఆయనే పంజాబ్ లో ఆప్ తరుపున ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని ప్రచారం సాగింది.కానీ సిద్ధుకి ఆప్ లో ప్రవేశమే దొరకలేదు.అదేమంటే ఆప్ శ్రేణులు ఒప్పుకోలేదని సమాధానం.దీంతో సిద్ధూ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అనిపించింది.కానీ స్వతహాగా క్రీడాకారుడైన సిద్ధూ వెంటనే కోలుకున్నాడు.బీజేపీ,ఆప్ రెండు పార్టీలకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు.

ఆవాజ్ ఏ పంజాబ్ పేరుతో సిద్ధూ సొంత పార్టీ ప్రకటించాడు.పంజాబ్ లో అధికారం కోసం తలపడుతున్న అకాలీదళ్,ఆప్ బహిష్కృత,అసమ్మతి నేతలకి గాలమేశాడు.ముఖ్యంగా పంజాబ్ లో అధికారం ఖాయమని భావిస్తున్న ఆప్ కి కోలుకోలేని షాక్ ఇచ్చాడు.ఆప్ కి చెందిన ఏడు జిల్లాల అధ్యక్షులు సిద్ధుతో కలిసి నడిచేందుకు ముందుకొచ్చారు.ఈ పరిణామాన్ని ఏమాత్రం ఊహించని ఆప్ అగ్రనేత ,ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివ్వెరపోయారు.ఇవన్నీ గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు మైదానంలోకి దిగుతూనే కేజ్రీని సిద్ధూ సెవెన్ కొట్టాడని వ్యాఖ్యానిస్తున్నారు.

Leave a Reply