మంత్రిప‌ద‌వితో సిద్ధూకు చిక్కులు!!

 Posted March 23, 2017

sidhu is unhappy with ministry
కాంగ్రెస్ లోకి స‌రైన టైంకి వ‌చ్చి హిట్ కొట్టిన మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ… ఇప్పుడు మంత్రి అయిపోయారు. ఎవ‌రైనా మినిస్ట‌ర్ అయితే హ్యాపీగా ఫీల‌వుతారు. పాపం సిద్ధూ త‌న‌కు మినిస్ట్రీ వ‌చ్చింద‌ని ఆనందించాలో… బాధ‌ప‌డాలో అర్థం కాక క‌న్ఫ్యూజ్ అవుతున్నారు.

సిద్ధూ క‌న్యూజ‌న్ కి కార‌ణం ఒక కామెడీ షో. ఎందుకంటే సోనీ టీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న కామెడీ నైట్స్ విత్ క‌పిల్ షోలో సిద్ధూ కంటిన్యూ అవుతున్నారు. కామెడీ షోలో నెంబ‌ర్ వ‌న్ గా ఉన్న ఈ ప్రోగ్రాంను వ‌దులుకోవ‌డం సిద్ధూకు ఇష్టం లేదు. దీని వ‌ల్లే ఇప్పుడు చిక్కుల్లో ప‌డుతున్నారు. ఎందుకంటే క‌పిల్ కు సాంస్కృతిక శాఖ‌ను కేటాయించారు. సాంస్కృతిక శాఖ మంత్రిగా ఆయ‌న ఒక‌టీవీషో చేయ‌డానికి నిబంధ‌న‌లు అడ్డుగా ఉన్నాయ‌ని స‌మాచారం. దీంతో ఇప్ప‌టికే పంజాబ్ సీఎం అమ‌రింద‌ర్ సింగ్ స్వ‌యంగా సిద్ధూతో మాట్లాడార‌ట‌. షో ను విడిచిపెట్టాల‌ని సూచించార‌ట‌.

సిద్ధూకు దేశవ్యాప్తంగా క్రేజ్ రావ‌డానికి ఈ కామెడీ షో కూడా కార‌ణం. కాబ‌ట్టి దీన్ని విడిచిపెట్ట‌డానికి ఆయ‌న అంగీక‌రించ‌డం లేదు. అందుకే పంజాబ్ సీఎం చెప్పినా… ఆయ‌న సున్నింత‌గానే కుద‌ర‌ద‌ని చెప్పార‌ట‌. ఏదైనా తెగేదాకా లాగ‌డం స‌రికాదు. ఒక‌వేళ నిబంధ‌న‌లు అడ్డుగా ఉంటే… సిద్ధూను సాంస్కృతిక శాఖ నుంచి త‌ప్పించే అవ‌కాశ‌ముంది. అదే జ‌రిగితే మ‌రి ఆయ‌న‌కు ఇంకో శాఖ‌ను కేటాయిస్తారా? లేక కొత్త చిక్కులెందుక‌ని… మినిస్ట్రీ ఇవ్వ‌కుండా ఖాళీగా ఉంచేస్తారా? చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు. ఎలాగూ ఎన్నిక‌లైపోయాయి.. కాబ‌ట్టి సిద్ధూ అవ‌స‌రం తీరిపోయింది. ఇక ఆయ‌న‌తో ప‌నేంటి? అన్న సాకుతో ఆయ‌న‌ను పూర్తిగా ప‌క్క‌న‌బెట్టినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేదు!! కాబ‌ట్టి ఇప్ప‌టికైనా సిద్ధూ రాజ‌కీయాన్ని ఒంట‌బ‌ట్టించుకోవాలంటున్నారు ఆయ‌న అభిమానులు!!!

SHARE