మోడీపై పగ తీర్చుకోబోతున్న సిద్ధూ?

0
550
sidhu taking revenge on modi

Posted [relativedate]

sidhu taking revenge on modi
పంజాబ్ లో రాజకీయం రసవత్తరంగా ఉంది. ముఖ్యంగా అకాలీదళ్-బీజేపీ కూటమికి మొదట్లో ఉన్నంత సానుకూలత ఇప్పుడు కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. దానికి ప్రధాన కారణం సిద్ధూనేనని టాక్. కాంగ్రెస్ లోకి సిద్ధూ ఎంట్రీతో అంతా మారిపోయిందట. ఒక్కసారిగా కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చేసిందన్న వాదన వినిపిస్తోంది.

గత లోక్ సభ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ అయిన సిద్ధూకు బీజేపీ సీటివ్వలేదు. అక్కడ అరుణ్ జైట్లీ నిలబడ్డా… ఆయన మాత్రం గెలుపును అందుకోలేకపోయారు. ఆ తర్వాత సిద్ధూకు రాజ్యసభ ఎంపీ ఇచ్చినా… బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని ఆయన ఫీలయ్యారు. అనంతరం ఆ పార్టీకి రాజీనామా చేసి… ఆప్, సొంత పార్టీ.. మీదుగా కాంగ్రెస్ లో వచ్చి చేరారు. కేంద్రమంత్రి రేసులో ఉండాల్సిన తాను.. ఇలా తాను పార్టీలు మారే దాకా పరిస్థితి రావడానికి మోడీనే కారణమని సిద్ధూ భావిస్తున్నారట. అందుకే మోడీపై పగ తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారట. అందులో భాగంగానే కాంగ్రెస్ తరపున జోరుగా క్యాంపెయిన్ చేస్తూ… జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారాయన.

స్వతహాగా మంచి మాటకారి అయిన సిద్ధూ… ఎన్నికల క్యాంపెయిన్ లో అకాలీదళ్-బీజేపీ కూటమిని చెడుగుడు ఆడుకుంటున్నారు. దీనికి అకాలీదళ్ నుంచి సరైన జవాబు రావడం లేదట. ప్రభుత్వ వైఫల్యాలను సిద్ధూ ఎత్తిచూపుతుంటే… దానికి అకాలీదళ్ నాయకులకు నోరు పెగలడం లేదట. అన్నింటికి మించి సామెతలు, ప్రాసలు, షాయరీలతో జనాన్ని ఆకట్టుకుంటున్నారట సిద్ధూ.

సిద్ధూ ప్రచారానికి మంచి స్పందన లభిస్తుండడంతో కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉందట. అకాలీదళ్- బీజేపీ కూటమి ఓటమి ఖాయమనే అంచనాకు వచ్చేసిందట. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. కచ్చితంగా ఆయనకు మంచి పదవి ఇవ్వాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారట. ఆయకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇవ్వొచ్చని సమాచారం. మొత్తానికి సిద్ధూ .. మోడీపై తన పగ తీర్చుకోవడానికి ఎక్కువ అవకాశముందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

Leave a Reply