వెండి తెర కేసీఆర్‌ ఈయనే

0
617
Silver- screen- is- KCR- are- boiywood -actor- raj -kumar- rao

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంతో మంది పోరటాం చేశారు. అయితే మలిదశ ఉద్యమంను ముందుండి నడిపించి, తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన కేసీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తాను సినిమా తీస్తాను అంటూ మధుర శ్రీధర్‌ చాలా రోజుల క్రితం ప్రకటించిన విషయం తెల్సిందే. ఆ విషయాన్ని అంతా మర్చిపోతున్న సమయంలో మరో ప్రకటన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేసీఆర్‌ పాత్రధారిగా బాలీవుడ్‌ నటుడు రాజ్‌ కుమార్‌ రావును ఎంపిక చేసినట్లుగా దర్శకుడు మధుర శ్రీధర్‌ ప్రకటించాడు.

‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్‌ కందూరి నిర్మాణంలో మధుర శ్రీధర్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కేసీఆర్‌ జీవిత చరిత్ర చిత్రం త్వరలోనే ప్రారంభం కాబోతుంది. తెలుగుతో పాటు పలు భాషల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తామని అంటున్నారు. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా సాగింది అనే విషయాలను కల్లకు కట్టినట్లుగా చిత్రంలో చూపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కలిపి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేసినట్లుగా దర్శకుడు మధుర శ్రీధర్‌ చెప్పుకొచ్చారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెళ్లడిస్తామని చెప్పుకొచ్చాడు. బాలీవుడ్‌ నటుడు రాజ్‌ కుమార్‌ రావులో కేసీఆర్‌ పోలికలు ఉన్న కారణంగానే ఆయన్ను ఎంపిక చేసినట్లుగా కూడా మధుర శ్రీధర్‌ చెప్పుకొచ్చాడు.

Leave a Reply