సింధు ఆటపై తల్లిదండ్రులు హ్యాపీ..

0
208

  sindhu parents happy about sindhu playసింధు చాలా బాగా ఆడి..చివరి వరకు పోరాడిందని సింధు తండ్రి పీవీ రమణ అన్నారు. భారత్ నుంచి ఒలింపిక్స్‌కు వెళ్ళడం గర్వంగా ఉందన్నారాయన. భవిష్యత్‌లో మరింత సమర్ధవంతంగా ఆడి స్వర్ణం సాధిస్తుందని అన్నారు ఆమె ఫాదర్.  కోచ్ గోపీచంద్ తో సహా దేశ ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు రమణ.వరల్డ్ నెంబర్ వన్ కరోలినా మారిన్‌కు రియో మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ పోరులో సింధు చుక్కలు చూపిందని తల్లి పీ విజయ. సింధును ఓడించడం అంత సులువు కాదని మొదటి రౌండ్ లో నిరూపించిందని తెలిపిందామె. తొలిసెట్ ఓడిపోతుందని అంతా అనుకునేలోపే కరోలినాను మెరుపువేగంతో ఓడించి సత్తా చాటిందన్నారామె. పుల్లెల గోపీ చంద్ అకడమీలో సింధు అభిమానులతో కలసి మ్యాచ్ ను లైవ్ లో వీక్షించారు ఆమె తల్లిదండ్రులు.

Leave a Reply