సైకత సింధు.. ఒరిస్సా కళాకారుడు అభినందనలు

  sindhu saikatha రియో ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన భారత బ్యాడ్మిటన్ స్టార్, తెలుగుతేజం పీవీ సింధు, కోచ్ గోపీచంద్ లను అభినందిస్తూ ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో చక్కటి శిల్పాన్ని తయారుచేశారు. ఒడిశాలో పూరీ సముద్రతీరంలో ఐదు అడుగుల ఎత్తైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇంగ్లీష్ లో కంగ్రాట్స్ పీవీ సింధు, థ్యాంక్స్ గోపీచంద్ అనే అక్షరాలతో పాటు బ్యాడ్మింటన్ ఆడుతున్నట్టుగా సింధు ప్రతిమ ఉంది.

సుదర్శన్ పట్నాయక్ ఈ శిల్పం తయారు చేయడానికి నాలుగు టన్నుల ఇసుకను వాడారు. ఒలింపిక్స్ లో సింధు పతకం సాధించడాన్ని దేశం గర్విస్తోందని, ఆమె విజయం వెనుక కోచ్ గోపీచంద్ ఉన్నాడని ప్రశంసించారు.  సమాజంలో ఆయా పరిస్థితులకు,  పరిణామాలకు సందర్భోచితంగా విలక్షణ శైలిలో సైకత శిల్పాలను రూపొందించడం సుదర్శన్ పట్నాయక్ ప్రత్యేకత.

SHARE