భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. గురువారం సాయంత్రం జరిగిన గ్రూపు తొలి మ్యాచ్ లో విజయాన్ని సాధించింది. హంగేరీకి చెందిన లారా సరోసిపై రెండు వరుస సెట్లలో 21-8, 21-9 తేడాతో సింధు గెలిచింది. సింధు రెండు సెట్లలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో కేవలం రెండు సెట్లకే హంగెరి ప్రత్యర్ధి పోరాటం ముగిసింది.