మరో సింగర్ ఆన్ స్క్రీన్ ఎంట్రీ..!

Posted November 18, 2016

Singer Geetha Madhuri Silver Screen Entryఇన్నాళ్లు ఆఫ్ స్క్రీన్ లో తన సుస్వరాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గీతా మాధురి ఇప్పుడు వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకోబోతుంది. తన భర్త, నటుడు నందు సహకారంతో ఆమె ఆన్ స్క్రీన్ పై వచ్చేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇప్పటికే అతిథి షార్ట్ ఫిల్మ్ లో నటించిన గీతా మాధురి ఇక సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఆల్రెడీ ఓ సినిమాకు సైన్ చేసిందని టాక్.

అయితే గీతా మాధురి హీరోయిన్ గా చేస్తుందా లేక అక్క వదిన లాంటి సపోర్టెడ్ రోల్స్ తో సరిపెట్టుకుంటుందా అన్నది చూడాలి. స్పెషల్ సాంగ్స్ కు తన వాయిస్ తో మైకం కమ్మేలా చేసే గీతా మాధురి ఇప్పుడు వెండితెర మీదకు వచ్చేస్తుంది అంటే ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. మరి సింగర్ గా సూపర్ సక్సెస్ అయిన గీతా మాధురి ఆర్టిస్ట్ గా ఏమేరకు విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

SHARE