సింగర్ సుచిత్ర కిడ్నాప్డ్??

Posted March 21, 2017

singer suchitra kidnapedరెండు వారాల క్రితం సింగర్ సుచిత్ర సుచీలీక్స్ పేరుతో అటు కోలీవుడ్ లోనూ ఇటు టాలీవుడ్ లోనూ ప్రకంపనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు, హీరోయిన్ల పర్సనల్ ఫొటోలు ఆమె ట్విట్టర్ నుండి షేర్ అయ్యాయి. ఇందులో టాలీవుడ్ కి చెందిన త్రిష, రానాలు కూడా ఉన్నారు. దీంతో  తమిళ సినీ ప్రముఖులతో పాటు  తెలుగు సినీ వర్గాల్లోని పెద్దలు కూడా  ఎక్కడ తమ ఫొటోలు లీకవుతాయోనని తెగ టెక్షన్ పడిపోయారు. అయితే గత వారం రోజులుగా సుచీ లీక్స్ కి కాస్త బ్రేక్ పడింది.

సుచిత్రకి మానసికస్థితి సరిగా లేనందున లండన్ వెళ్లనుందని వారం రోజుల క్రితం వార్తలు వచ్చాయి. దీంతో అందరూ ఆమె లండన్ కి వెళ్లిపోయిందని ఊపిరి పీల్చుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె లండన్ వెళ్లలేదని తెలుస్తోంది. సుచీలీక్స్ వ్యవహారం నచ్చని కొందరు కోలీవుడ్ పెద్దలు ఆమెను కిడ్నాప్ చేశారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సుచిత్ర భర్త స్పందిస్తే కానీ అసలు విషయాలు బయటకు రావు.

SHARE