సంచలనంగా మారుతున్న “సుచి”లీక్స్

239

Posted [relativedate]

Singer Suchitra leaked private photos of Dhanush Trisha rana andria ravichandran and Hansikaఇంటర్నెట్‌లో ప్రస్తుతం సినీ తారల ప్రైవేట్ ఫొటోల లీకుల వ్యవహారం జోరుగా జరుగుతోంది. తెలుగులో సారొచ్చారు, డోలె డోలె వంటి సూపర్‌ హిట్‌ పాటలు పాడిన కోలీవుడ్ సింగర్ సుచిత్ర…కొన్ని రోజుల క్రితం   హీరో ధనుష్ తనను గాయపరిచాడంటూ ట్వీట్ చేసిన  సంగతి తెలిసిందే.

తాజాగా నిన్న ఆమె ట్విట్టర్ నుండి కోలీవుడ్ కి చెందిన సెలబ్రిటీల పర్సనల్ ఫొటోలు లీకయ్యాయి.  ధనుష్, హన్సిక, అనిరుధ్ తదితర తారల ప్రైవేట్ ఫొటోలను షేర్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన  సుచిత్ర తన అకౌంట్ హ్యాకింగ్ కు గురైందని తెలిపింది. ఈసారి హ్యాకర్ తన ఫోటోను కూడా పెట్టాడని, అయితే  తాను జాగ్రత్తపడ్డానని చెప్పింది. తన పేరుమీద ఉన్న ట్విట్టర్ ఎకౌంట్ ని తొలిగించానని వివరణ ఇచ్చింది. కాగా కొద్దిసేపటి క్రితమే  రానా, త్రిషల ప్రైవేట్ ఫొటో కూడా  అదే ఎకౌంట్ నుండి బయటపడింది. పూర్తిగా తొలిగించిన ఎకౌంట్ నుండి తారల ప్రైవేట్ ఫొటోలు బయటకు రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సుచిత్ర మాత్రం.. ఈ విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి క్లారిటీ ఇస్తానని, ప్రతి ఒక్కరికి క్షమాపణలను తెలియజేసింది. ఏది ఏమైనా సుచీలీక్స్ అంటూ సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ నడుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here