మరో బాంబ్ పేల్చిన సింగర్ సుచిత్ర

148

Posted [relativedate]

singer suchitra says dhanush and anirudh rape to meగత  రెండు మూడు రోజుల నుండి సుచీ లీక్స్ పేరుతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది కోలీవుడ్ పరిశ్రమ. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోని రానా, త్రిషల పర్సనల్ ఫొటోలను కూడా నిన్న పోస్ట్ చేసేసింది సుచిత్ర. అయితే తన ట్విట్టర్ ఎంకౌంట్ ని ఎవరో హ్యాక్ చేశారని ఇప్పటివరకు చెప్పుకొచ్చిన సుచిత్ర తాజాగా మరో బాంబ్ ని పేల్చింది. తనకు మందు తాగించి హీరో ధనుష్, సంగీత దర్శకుడు అనునిధ్‌ లు తనను రేప్  చేశారని, త్వరలోనే వాటికి సంబంధించిన వీడియోలను కూడా అప్‌ లోడ్ చేస్తానని  హెచ్చరించింది. 

ఇప్పటివరకు తాను పోస్ట్ చేసిన ధనుష్, అనిరుద్ ల ఫొటోలు వారి ఫోన్ నుండి తీసినవేనని ట్వీట్ చేసింది. దీనితో పాటు కోలివుడ్‌ లో నన్ను ఎదురించే మగాళ్లు ఉన్నారా? తమిళ చిత్ర పరిశ్రమ కోవమ్ నదికన్నా కంపు అని ట్వీట్ ల రూపంలో బాణాలను సంధిచింది. వాళ్ల పర్సనల్ వ్యవహారాలను బయటపెడుతుండడంతో తనను ధనుష్, అనిరుద్ లు  బెదిరిస్తున్నారని మరో  ట్వీట్ చేసిన సుచిత్ర.. తనపై ఏమని కంప్లైంట్ చేస్తారు అని ప్రశ్నించింది.  న్యూ ఇయర్ వేడుక కోసం డిసెంబరు 30న త్రిష థాయ్‌ల్యాండ్ వెళ్లిందని, ఆ మరుసటి రోజే ధనుష్ కూడా అక్కడకు వెళ్లాడని, బాగా ఎంజాయ్ చేశారని చెప్పింది. ఆ విషయం అవాస్తవమని వారు ఒప్పుకోగలరా? అని సుచిత్ర  ప్రశ్నించింది.

కాగా  ఆమె మానసిక స్ధితి సరిగాలేదని ఆమె భర్త మరో పక్క ప్రకటించినా ధనుష్ అభిమానులు మాత్రం మండిపడుతున్నారు. మానసిక పరిస్థితి సరిగా లేకపోతే పాత విషయాలన్నీ ఎలా గుర్తుంటాయని, వాటన్నింటినీ ఇప్పుడు తిరగదోడి తమ హీరో పరువుతోపాటు, ధనుష్ మామగారైన రజినీకాంత్ పరువుని పరోక్షంగా  తీస్తోందని వాపోతున్నారు. రజినీ రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ వార్తలు వస్తున్న సమయంలో రజినీ అల్లుడు గురించి ఇలాంటి ట్వీట్లు  చేయడం బాధాకరమంటున్నారు. ఇప్పటికైనా సుచిత్ర మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here