ఉదయభానుతో సునీతకి గొడవేంటీ.. ?

 Posted October 20, 2016

singers sunitha anchor udaya bhanu cold war

బుల్లితెర యాంకర్ ఉదయ భాను, సింగర్ సునీల మధ్య ఓ మోస్తరు యుద్దమే జరిగినట్టుంది. ఆ గొడవ తాలుకు వివరాలు చాలా ఆలస్యంగా ఇటీవలే తెలిసివచ్చాయి. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఉదయభాను మాట్లాడుతూ… అమెరికా టూర్ లో ఓ ఫేమస్ తెలుగు సింగర్ కారణంగా చేధు అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది. తననీ కనీసం స్టేజ్ పైకి కూడా పిలవలేదని.. ఇంతకన్నా ఘోర అవమానం మరోటి ఉండదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ ఉదయభానుని హర్ట్ చేసిన ఆ ఫేమస్ సింగర్ ఎవరబ్బా.. ? అని జనాలు తెగ ఆలోచనలో పడ్డారు.

అయితే, అది నేనే అన్నట్టు సింగర్ సునీత బయటపడింది. ఉదయభాను వాఖ్యలకి సమాధానం ఇచ్చింది. నిజానికి ఉదయభాను  తనను అపార్థం చేసుకుంది. ఆ ప్రోగ్రామ్‌ కి రమ్మని ఉదయభానుని తాను పిలవలేదు. ఆమెని ఆర్గనైజర్లు పిలిచారు.అలాంటప్పుడు తానెందుకు స్టేజ్‌పైకి పిలుస్తానని చెప్పుకొచ్చింది.అయితే, టూర్ తర్వాత ఉదయభాను చాలా సార్లు మాట్లాడించిన మాట్లాడలేదని సునీత తెలిపింది. మరి.. వీరి మధ్య చోటుచేసుకొన్న మనస్పర్థలు ఎప్పుడు తొలుగుతాయో చూడాలి.

SHARE