సీతమ్మ నగలు ఎక్కడ.?

   sita jewelry robbery  bhadrachalam

ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో రెండు ఆభరణాలు కన్పించడం లేదనేది వాస్తవమేనని దేవస్థానం ఈఓ తాళ్లూరి రమేశ్‌బాబు  వెల్లడించారు.తనకు సమాచారం వచ్చిన వెంటనే సంబంధిత అర్చకులను ఆభరణాలు తనిఖీ చేయాని ఆదేశించానన్నారు.  

సుమారు రెండు గంటల పాటు వారు తనిఖీలు చేయగా నిత్యకల్యాణం సమయంలో స్వామికి, అమ్మవారికి వినియోగించే బంగారు ఆభరణాల్లో రెండు గొలుసులు వాటి లాకెట్లు, సూత్రాలు కన్పించడం లేదని ప్రాథమికంగా వెల్లడైందన్నారు. అయితే మరోమారు తనిఖీలు నిర్వహించాక వారి నివేదిక ప్రకారం దేవస్థానం తరఫున తాము కూడా పరిశీలించి కమిషనర్‌కు నివేదిస్తామని తెలిపారు.నిర్లక్ష్యం మాట వాస్తవమేనని, దీనిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

SHARE