ఖడ్గం పట్టిన కాటమరాయుడు..!!

Posted [relativedate]

siva balaji sword gift to pawan kalyanడాలి దర్శకత్వంలో పవర్ స్టార్   పవన్‌ కళ్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియా రికార్డులను బ్రేక్ చేసి వార్తల్లో నిలిచింది. నిన్న లీకైన ఫైట్ సీన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా ఖడ్గం పట్టిన కాటమరాయుడు అంటూ మరికొన్ని సీన్స్ కూడా లీకయ్యాయి. అయితే  ఇది సినిమాలో సీన్ అనుకుంటే పొరపాటే. ఎందుకంటే మన పవర్ స్టార్ ఖడ్గాన్ని పట్టింది సినిమా కోసం  కాదు. అది గిఫ్ట్ గా వచ్చింది.

కాటమరాయుడు సినిమాలో  పవన్ సోదరుడిగా నటిస్తున్న శివబాలాజీ పవన్ కి వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. తన అభిమానాన్ని చాటుకోడం కోసం సినిమా ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా ఓ ఖడ్గాన్ని ప్రత్యేకంగా  తయారు చేసి బహుమతిగా ఇచ్చారు. ఆ ఖడ్గంపై పవన్ ఫోటోతో పాటు జనసేన లోగో  కూడా దర్శనమిచ్చింది.

siva balaji sword gift to pawan kalyanగిఫ్ట్ అందుకున్న  పవన్‌…  పక్కనే ఉన్న ఆలీ చేతిని పట్టుకుని కత్తితో నరుకుతున్నట్టు ఫోజులు ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా పవన్ ఫొటోకి ఫోజులు బాగానే ఇస్తున్నాడని, ఆ ఖడ్గం పట్టుకుని ఫోజులు ఇవ్వగానే సరిపోదని,  ఏపిలో ఉన్న అవినీతిని నరికివేయాలని కొందరు విమర్శకులు అంటున్నారు. కాగా మరికొందరు చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదని సూచిస్తున్నారు. మరి పవన్ ఈ ఖడ్గాన్ని షోకేస్ లో పెట్టి తృప్తిపడతాడో లేక నిజంగానే అవినీతిని పారద్రోలుతాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here